సినీ పరిశ్రమని విషాదాలు వెంటాడుతూనే ఉంటున్నాయి. నిత్యం ఎవరొక సెలబ్రిటీ మృతి చెందుతున్నారు. కొంతమంది అనారోగ్య సమస్యలతో మరికొందరు వయోభారంతో.. లేదు అంటే ప్రమాదవశాత్తు కొంతమంది, ఆత్మహత్య చేసుకుని ఇంకొంతమంది.. ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది అప్పుడే చాలా మంది నిర్మాతలు నటీనటులు మరణించడం జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు మిగతా సినిమా పరిశ్రమల్లో కూడా ఎవరొకరు మరణిస్తూ ఉండటం అనేది అందరికీ షాకిచ్చే అంశం.
నిన్నటికి నిన్న మలయాళ సీనియర్ నటుడు విష్ణు ప్రసాద్ కూడా మృతి చెందాడు. ఆ న్యూస్ మలయాళ సినీ పరిశ్రమని కుదిపేసింది. ఆ షాక్ నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే… ఫిలిప్పీన్స్ నటుడు అయినటువంటి రికీ దవావో (Ricky Davao) ఈరోజు కన్నుమూశారు. అతని వయసు 63 సంవత్సరాలు. కొన్నాళ్ళుగా క్యాన్సర్ తో బాధపడుతూ వస్తున్న ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించినట్టు ఆమె తెలిపారు.
‘మా నాన్న తన లైఫ్లోని ప్రైమ్ టైంని సినిమా రంగానికే అంకితం చేశారు. కొడుకు, స్నేహితుడు,తండ్రిగా ఆయన్ని చూస్తూ వచ్చాను. ఆయన ఏ లోకంలో ఉన్నా సంతోషంగా ఉండాలని భావిస్తున్నాను’ అంటూ ఆమె రాసుకొచ్చారు. ఇక రికీ దవావో (Ricky Davao) ఫిలిప్పీన్ సినీ పరిశ్రమలో వందల సినిమాల్లో నటించాడు. అలాగే ఎన్నో వెబ్ సిరీస్లలో కూడా కనిపించాడు. అతని మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అంటూ ఫిలిప్పీన్ ఫిలిం మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.