ఇటీవల అల్లు శిరీష్.. పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపి ఇండస్ట్రీ మొత్తాన్ని సర్ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. అతని తాతగారు అల్లు రామలింగయ్య జయంతి నాడు ‘నైనిక అనే అమ్మాయితో త్వరలో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు’ తెలిపాడు.తన నాయనమ్మ చివరి రోజుల్లో శిరీష్ పెళ్లి చూడాలని’ ఆశ పడినట్లు కూడా చెప్పుకొచ్చాడు. వీరి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేసి బ్లెస్ చేసేందుకు కూడా రెడీ అయ్యింది.
అక్టోబర్ 31న వీరి నిశ్చితార్థ వేడుక జరగనుంది. ఈ వేడుకను ప్రైవేట్ గా జరపనున్నారట. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ కానుందని తెలుస్తోంది. చిరంజీవి- సురేఖ..లతో పాటు రామ్ చరణ్–ఉపాసన, వరుణ్ తేజ్–లావణ్య త్రిపాఠి.. పవన్ కళ్యాణ్ దంపతులు ఇలా అందరూ హాజరయ్యే అవకాశం ఉందట. అంతేకాదు టాలీవుడ్ కి చెందిన పెద్ద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శిరీష్ నిశ్చితార్థ వేడుకలో సందడి చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
మొదట శిరీష్- నైనిక..ల ఎంగేజ్మెంట్ వేడుకని ఓపెన్ ప్లేస్ లో ప్లాన్ చేశారట. కానీ ఎడతెగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. ఆ ఆలోచన విరమించుకున్నట్టు సమాచారం.ఇక శిరీష్ పెళ్లి చేసుకోబోతున్న నైనిక కూడా..అతని వదిన అల్లు స్నేహ మాదిరి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అనే సంగతి తెలిసిందే. 2 ఏళ్ళ నుండి శిరీష్ తో నైనిక డేటింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది.
నైనిక తండ్రి రియల్ ఎస్టేట్ అలాగే కన్స్ట్రక్షన్ బిజినెస్లో బాగా సంపాదించారట. అందుకే అల్లు అరవింద్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఓకే చేసినట్లు సమాచారం.