Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి లేటెస్ట్ ఫోటో వైరల్..!

స్టార్ హీరో అల్లు అర్జున్ స్టైల్ కు ఐకాన్ లా అనిపిస్తాడు.అందుకే అతను ఇన్నాళ్లు స్టైలిష్ స్టార్ గా, ఇప్పుడు ఐకాన్ స్టార్ గా రాణిస్తున్నాడు. బన్నీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చడానికి కారణాలు ఒకటి డాన్స్ అయితే మరొకటి అతని స్టైల్. అల్లు అర్జున్ కు అతని భార్య స్నేహ కూడా ఏమాత్రం తీసిపోదు అనే చెప్పాలి.ఈ దంపతులను స్టైలిష్ కపుల్‌ అని కూడా ప్రేక్షకులు సంభోదిస్తూ ఉంటారు. ట్రెండ్‌ని స్టార్ట్ చేసేదే వీళ్ళేమో అని ఆశ్చర్యపోయేలా వీళ్ళ డ్రెస్సింగ్ ఉంటుంది.

అల్లు అర్జున్ అంటే స్టార్ హీరో, ఇవన్నీ తప్పవు.. కానీ అల్లు స్నేహ ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తుంది అనే డౌట్ క్రియేట్ చేసేలా ఆమె ట్రెండ్ ను ఫాలో అవుతూ ఉంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ ఆమె ఇలా ఉండడం అంటే సాధారణ విషయం కాదు. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో ఓ లేటెస్ట్ పిక్ ను షేర్ చేసింది. ఈ ఫోటోలో బ్లాక్ డ్రెస్ లో చాలా ట్రెండీగా కనిపిస్తుందామె..! హీరోయిన్లు కూడా ఈమె పక్కన పనికిరారేమో అనే అనుమానం రావడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఇక ఈ మధ్యనే తన భర్త, పిల్లలతో కలిసి విదేశాలకు వెకేషన్ కు వెళ్లి వచ్చింది అల్లు స్నేహ . మరో పక్క అల్లు అర్జున్ ‘పుష్ప'(‘పుష్ప ది రైజ్) సక్సెస్ ను ఇప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటూనే మరోపక్క ..తన భార్య, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా యాడ్స్ లో నటిస్తూ వస్తున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus