తాత నటించిన సినిమాలో మనవడు!
- August 17, 2016 / 09:02 AM ISTByFilmy Focus
లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాల్లో మరపురాని చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’. ఆ సినిమాలో పాటలు, డైలాగ్స్, కృష్ణ నటన ఇప్పటికీ అభిమానుల్లో గుర్తుండిపోతాయి. ఆయన కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా అది. అటువంటి సినిమాలో ఇప్పుడు ఆయన మనవడు మహేశ్ గారాల కొడుకు గౌతమ్ నటించనున్నాడనేది లేటెస్ట్ గాసిప్.
గౌతమ్ తన తండ్రి నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్స్ గా పరిచయమయ్యాడు. ఈసారి బాల నటుడిగా పూర్తి స్థాయిలో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గులాభి, అనగనగా ఒకరోజు వంటి చిత్రాలకు రచయితగా పని చేసిన నడిమింటి నరసింగరావు ఈ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బాల్యంలో సీతారామరాజు ఎటువంటి సంఘటనలను ఎదుర్కొన్నాడు. స్వాతంత్ర సమరయోధిడిగా మారడానికి ఆయనను ఎలాంటి సంఘటనలు ప్రభావితం చేసాయనే అంశాలతో సినిమా నడుస్తుంటుంది. గౌతమ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ కథను సిద్ధం చేస్తున్నారు. మరి దీనికి మహేష్ ఫ్యామిలీ అంగీకరిస్తుందో.. లేదో.. చూడాలి!
















