శివ కార్తికేయన్ (Sivakarthikeyan) , సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన ‘అమరన్’ (Amaran) చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది.కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మించిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకుడు. 2014లో వీరమరణం పొందిన గొప్ప సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో 3 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకుంది ఈ చిత్రం. ఆదివారం కూడా బాగా క్యాష్ చేసుకుంది. ఇక మొదటి సోమవారం కూడా ఈ చిత్రం పర్వాలేదు అనిపిస్తుంది.
నైజాంలో బెటర్ గా కలెక్ట్ చేస్తున్న ఈ చిత్రం, ఆంధ్ర వంటి ఏరియాల్లో కొంచెం తగ్గింది అని చెప్పాలి. ఒకసారి (Amaran) 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 4.70 cr |
సీడెడ్ | 1.36 cr |
ఉత్తరాంధ్ర | 1.42 cr |
ఈస్ట్+వెస్ట్ | 0.58 cr |
కృష్ణా + గుంటూరు | 0.83 cr |
నెల్లూరు | 0.25 cr |
ఏపి+ తెలంగాణ(టోటల్) | 9.14 cr |
‘అమరన్’ చిత్రానికి తెలుగులో రూ.4.45 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 3 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 5 రోజులు ముగిసేసరికి రూ.9.14 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.4.14 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి ఆల్రెడీ డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. మొదటి సోమవారం అదీ ఓ డబ్బింగ్ సినిమా కోటి షేర్ ని కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం ఏమీ కాదు.