Laal Singh Chaddha: జనాలకు నచ్చలేదు.. ఒరిజినల్‌ యాక్టర్‌కి బాగా నచ్చిందట.. ఇదేం విచిత్రమో కదా!

ఎంతో ప్రేమతో, ఇష్టపడి చేసిన సినిమాల లిస్ట్‌ అంటూ ఒకటి ఆమిర్‌ ఖాన్‌ రాస్తే.. అందులో కచ్చితంగా ‘లాల్‌ సింగ్‌ చద్దా’ (Laal Singh Chaddha)  ఉంటుంది. అలాగే వసూళ్ల విషయంలో, ట్రోలింగ్‌ విషయంలో ఎప్పటికీ గుర్తుంచుకోకూడదు అని అనుకునే సినిమాల లిస్ట్‌ రాస్తే అందులో కచ్చితంగా తొలి స్థానంలో నిలిచే సినిమా కూడా అదే. అంతగా ఆ సినిమా ఆయన్ను, బాలీవుడ్‌ను ఇబ్బంది పెట్టింది. సుమారు రూ. 50 కోట్ల నష్ట తెచ్చి పెట్టిన సినిమా అది.

Laal Singh Chaddha

ఇప్పుడు ఆ డిజాస్టర్‌ సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఆ సినిమా మాతృక అయిన ‘ఫారెస్ట్‌ గంప్‌’ ప్రధాన నటుడు ఇప్పుడు ‘లాల్‌ సింగ్‌ చద్దా’ను తెగపొగిడేశాడు. దీంతో ‘ఇదే విచిత్రం’ అంటూ ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. రెండేళ్లక్రితం విడుదలైన ఈ సినిమాను ఉద్దేశించి హాలీవుడ్‌ స్టార్‌ టామ్‌ హాంక్స్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘లాల్‌ సింగ్‌ చద్దా’ సినిమాను చూసినట్లు చెప్పిన హాంక్స్‌.. అద్భుతంగా ఉందని పొగిడేశాడు.

‘లాల్‌ సింగ్‌ చద్దా’లో నటీనటులు చక్కగా యాక్ట్‌ చేశారని, ఓ సినిమా నుండి మరో సినిమా వస్తుందని చెప్పడానికి ఈ సినిమా ఓ నిదర్శనం అని అన్నాడు. తాము అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ‘ఫారెస్ట్‌ గంప్‌’ తెరకెక్కించామని.. ఇప్పటి సాంస్కృతిక, భాషాపరమైన ఆలోచనలకు తగ్గట్టుగా ‘లాల్‌ సింగ్‌ చద్దా’ తెరకెక్కించారని విశ్లేషించాడు టామ్‌ హాంక్స్‌. ఒరిజినల్‌, రీమేక్‌ల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పాడు.

‘లాల్‌ సింగ్‌..’ టీమ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’ సినిమా కథను అర్థం చేసుకొని, తమ శైలిలో తీర్చిదిద్దిన విధానం బాగుందని కూడా హాంక్స్‌ అన్నాడు. ఇక ‘లాల్‌ సింగ్‌ చద్దా’ విషయానికి వస్తే ఆమిర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ (Kareena Kapoor Khan ) జంటగా నటించారు. అద్వైత్ చంద‌న్‌ (Advait Chandan) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగచైతన్య (Naga Chaitanya) ఓ కీలకపాత్ర పోషించాడు. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా రూ.180 కోట్ల బడ్జెట్‌కి గాను రూ. 130 కోట్లే వసూళ్లు సాధించింది.

రౌడీ స్టార్‌ తో హాలీవుడ్ విలన్‌?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus