Amigos Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘అమిగోస్’..!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అమిగోస్’. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ లు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీత దర్శకుడు. ఆషిక రంగనాథ్ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యింది. అయితే తొలి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే కళ్యాణ్ రామ్ నటన కోసం కచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు అని..

సినిమా బాగుంది అన్న వాళ్ళు, బాగోలేదు అన్న వాళ్ళు కూడా కామన్ గా చెప్పిన పాయింట్. కానీ కలెక్షన్లు మాత్రం చాలా దారుణంగా నమోదయ్యాయి. ఓపెనింగ్స్ సోసోగా నమోదైనా వీక్ డేస్ లో మూవీ స్లీపేసింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 1.54 cr
సీడెడ్ 0.98 cr
ఉత్తరాంధ్ర 0.67 cr
ఈస్ట్ 0.48 cr
వెస్ట్ 0.29 cr
గుంటూరు 0.59 cr
కృష్ణా 0.43 cr
నెల్లూరు 0.24 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 5.22 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.35 cr
ఓవర్సీస్ 0.74 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 6.31 cr (షేర్)

‘అమిగోస్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.15.22 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.15.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ కేవలం రూ.6.31 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. సో బయ్యర్స్ కు ఈ మూవీ రూ.9.19 కోట్ల నష్టాలను మిగిల్చి డబుల్ డిజాస్టర్ గా మిగిలింది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus