టాలెంటెడ్ యాక్టర్ కమ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ అనే డిఫరెంట్ మూవీతో ఫిబ్రవరి 10న ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చాడు. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఆయన మూడు విభిన్నమైన పాత్రలలో త్రిపాత్రాభినయం చేశాడు. ‘బింబిసార’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తుండడం, పైగా ట్రిపుల్ రోల్ చేయడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. యూఎస్ ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారు జామున షోలతో హిట్ టాక్ తెచ్చుకుంది.
రాజేంద్ర రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీతో ఆషిక రంగనాథ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఆకట్టుకునే కథ, కథనాలతో కొత్త దర్శకుడైనా కానీ రాజేంద్ర రెడ్డి సినిమాను హ్యాండిల్ చేసిన విధానం బాగుందంటూ అభినందిస్తున్నారు. అలాగే కళ్యాణ్ రామ్ ‘సిద్దార్థ్, మంజునాథ్ హెగ్డే, మైఖేల్’ అనే మూడు వైవిద్యభరిమైన పాత్రల్లో అలరించాడు. ఒక్కో క్యారెక్టర్‌కి గెటప్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ పరంగా చాలా బాగా కేర్ తీసుకుని తన నటనతో వన్నె తెచ్చాడు.
ముఖ్యంగా నెగిటివ్ క్యారెక్టర్‌లో ఇరగదీసేశాడు. రగ్డ్ లుక్, బాడీ లాంగ్వేజ్‌తో పాటు లుక్స్‌తో భయపెట్టేలా ఎక్స్‌ట్రార్డినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పాజిటివ్ టాక్, డీసెంట్ కలెక్షన్లతో కళ్యాణ్ రామ్ కెరీర్‌లో సూపర్ హిట్ ఫిలింగా నిలిచింది ‘అమిగోస్’.. ఈ సందర్భంగా.. ట్రిపుల్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ ‘మాన్‌స్టర్’ పేరుతో గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్‌కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు.
సెకండ్ హాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్‌లో గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సాంగ్‌లోని సన్నివేశాలతో కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. కళ్యాణ్ రామ్ పోషించిన నెగిటివ్ క్యారెక్టర్‌ని డైరెక్టర్ డిజైన్ చేసిన విధానం బాగుంది. ‘‘సమాధులు తవ్వితే.. చరిత్ర బయట పడుతుంది.. నా చరిత్ర తవ్వితే.. సమాధులు మాత్రమే బయట పడతాయ్’’ అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ హైలెట్‌గా నిలిచింది.