Vijay Devarakonda: పూరీ ప్లానింగ్ తెలిస్తే అదరహో అనాల్సిందే!

డాషింగ్ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ కు బాలయ్య అంటే చాలా ఇష్టం. వీరిద్ద‌రూ చేసింది ఒక్క సినిమానే అయినా వీరి మధ్య అంత మంచి బాండింగ్ ఏర్పడింది. గత మూడేళ్ళుగా బాలయ్య- పూరి లు రెగ్యులర్ గా కలుసుకుంటూనే ఉన్నారు. అందుకే పూరీ జ‌గ‌న్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగ‌ర్’ కోసం బాల‌కృష్ణ‌ని ఓ ఫేవ‌ర్ అడిగాడట పూరి.అందుకు బాల‌య్య‌..కూడా ఓకే చెప్పారని తెలుస్తుంది. మరోపక్క హిందీలో ‘బిగ్ బి’ అమితాబ్‌ బచ్చన్ ను కూడా అదే విధంగా ఫేవర్ అడిగారట పూరి.

ఇంతకీ ఈ ఇద్దరి స్టార్లని పూరీ అడిగిన ఫేవర్ ఏంటి? అనే ప్రశ్న మీ మైండ్లో రన్ అవుతూ ఉండొచ్చు. మ్యాటర్ ఏంటంటే.. ‘లైగ‌ర్‌’… పూర్తిగా బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న సినిమా. పాన్ ఇండియా పూరి దీనిని తెలుగుతో పాటు హిందీ భాష‌ల్లో కూడా రూపొందిస్తున్నాడు. ఏకంగా మైక్ టైస‌న్‌ను కూడా ఓ కీల‌క పాత్ర‌కి తీసుకున్నాడు. మైక్ టైస‌న్ కు సంబందించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు.

అయితే మైక్ టైసన్ కు హిందీ మరియు తెలుగు భాష‌ల్లో ఒకరు డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. అందుకే టాలీవుడ్ నుండీ బాల‌య్యతో, బాలీవుడ్ నుండీ అమితాబ్‌ తో డబ్బింగ్ చెప్పించడానికి సన్నాహాలు చేస్తున్నాడట పూరి. చెప్పాలంటే ఇది సూపర్ స్కెచ్చే..!

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus