‘షోలే’ నాటి ఆసక్తికర విషయం పంచుకున్న అమితాబ్‌ బచ్చన్

‘షోలే’ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ సినిమాలో నటీనటుల పర్‌ఫార్మెన్స్‌ గురించి, సినిమా సృష్టించిన అద్భుతాల గురించి ఎంత చర్చించుకున్నా తక్కువే. అంతేకాదు ఆ సినిమా సెట్స్‌లో జరిగిన సరదా సంఘటనలు, ఆసక్తికర అంశాల గురించి కూడా ఎంత చెప్పుకున్నా విశేషాలకు కొదవ ఉండదు. అందుకే సందర్భంతో సంబంధం లేకుండా ఈ సినిమా ఎప్పుడూ ఏదో ఒక విషయంతో చర్చల్లో ఉంటుంది. తాజాగా మరో ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ వేదికగా అమితాబ్‌ బచ్చన్‌ ఈ విషయాన్ని పంచుకున్నారు.

‘షోలే’ క్లైమాక్స్‌ చిత్రీకరిస్తున్నప్పుడు ఓ సన్నివేశానికి ధర్మేంద్ర టేక్‌లు మీద టేక్‌లు తీసుకున్నారట. ఆ సమయంలో ఆయనకే విపరీతమైన చిరాకు వచ్చింది. దీంతో పక్కనే బాక్సులో ఉన్న బుల్లెట్లు తీసుకుని తుపాకీలో లోడ్‌ చేసి షూట్ చేశారట. అందులో ఒక బుల్లెట్ అమితాబ్‌ చెవి పక్కనుంచి వెళ్లిందట. తుపాకీలో బుల్లెట్లు పేలడంతో ధర్మేంద్ర షాక్‌కి గురయ్యారట. ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో అమితాబ్‌ దూరంగా ఓ కొండపై నిలబడి ఉన్నారు. అదృష్టవశాత్తూ ఆయనకేమీ కాలేదట.

ఈ సినిమా సమయంలోనే కాదు… ఆ తర్వాత మరో సినిమాలో కూడా అమితాబ్‌ ప్రాణాల మీదకొచ్చిన విషయం తెలిసిందే. ‘కూలీ’ సినిమా చిత్రీకరణ సమయంలో అమితాబ్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చాలా రోజుల చికిత్స తీసుకొని ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పటికీ బిగ్‌బీ ఆ రోజు విషయాల్ని గుర్తు చేసుకుంటుంటారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus