బాలీవుడ్ ఇండస్ట్రీ, సౌత్ ఇండస్ట్రీ సినిమాల మధ్య ప్రస్తుతం విచిత్రమైన పోటీ నెలకొందనే సంగతి తెలిసిందే. బాలీవుడ్ సినిమాలు, సౌత్ సినిమాలు పోటీ పడుతుండగా సౌత్ సినిమాలే పైచేయి సాధిస్తున్నాయి. బాలీవుడ్ సినిమాలలో కొన్ని సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నా ఆ సినిమాలకు పని చేస్తున్న డైరెక్టర్లలో ఎక్కువమంది సౌత్ డైరెక్టర్లు అనే సంగతి తెలిసిందే. జవాన్ సినిమాకు అట్లీ దర్శకునిగా పని చేయగా యానిమల్ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా పని చేశారు.
అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కొన్ని మంచి సినిమాలు తెరకెక్కుతుండగా గతంతో పోల్చి చూస్తే మాత్రం బాలీవుడ్ సినిమాలలో క్వాలిటీ తగ్గిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కామెంట్లు తన దృష్టికి రావడంతో బిగ్ బీ అమితాబ్ బాలీవుడ్ కంటే సౌత్ ఇండస్ట్రీ గొప్పని చెప్పడం సరికాదని కామెంట్లు చేశారు. ఎంతో అనుభవం ఉన్న అమితాబ్ సినిమాల గురించి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
సమాజంను సినిమాలు ప్రభావితం చేస్తాయని కొందరు చెబుతున్నారని అయితే అది నిజం కాదని వాస్తవ సంఘటనలే సినిమాలకు స్పూర్తిగా నిలుస్తున్నాయని అమితాబ్ పేర్కొన్నారు. ప్రాంతీయ భాషా సినిమాలకు ఈ మధ్య కాలంలో ఆదరణ పెరిగిందని ప్రాంతీయ భాషా సినిమాలలో వేషధారణ మార్చడంతో ఆ సినిమాలు అద్భుతం అని ప్రేక్షకులు భావిస్తున్నారని ఆయన అన్నారు.
సౌత్ వాళ్లకు వాళ్ల సినిమా గురించి బాగుందని మెచ్చుకుంటే శక్తి, షోలే, దీవార్ సినిమాల నుంచి స్పూర్తి పొందామని వాళ్లు చెబుతున్నారని అమితాబ్ అభిప్రాయపడ్డారు. తమిళ, మలయాళ సినిమాలు వాటికవే స్పెషల్ అని అంత మాత్రాన బాలీవుడ్ కంటే సౌత్ ఇండస్ట్రీ గొప్పదని చెప్పడం సరికాదని ఆయన పేర్కొన్నారు. అయితే అమితాబ్ కామెంట్లపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అమితాబ్ (Amitabh Bachchan) వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.