వర్మ ఇప్పటికే చాలా కాంట్రవర్సీ చిత్రాలు తీశాడు కానీ.. “కమ్మరాజ్యంలో కడపరెడ్లు” అలియాస్ “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” సినిమాతో క్రియేట్ అయినంత రచ్చ, హడావుడి, హల్ చల్ మాత్రం మరే సినిమాకి క్రియేట్ అవ్వలేదు. నవంబర్ 29 విడుదలవ్వాల్సిన ఈ చిత్రం సెన్సార్ ఇష్యూస్ కారణంగా వాయిదాపడి.. అసలు సెన్సార్ అవుతుందో లేదో అనే కన్ఫ్యూజన్ లో ఎట్టకేలకు నిన్న సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదల చేసేందుకు వర్మ సన్నాహాలు మొదలెట్టాడు.
నిజానికి డిసెంబర్ 13న “వెంకీ మామ” విడుదలవుతుండడంతో థియేటర్ల లభ్యత చాలా పెద్ద ప్రోబ్లమ్. కానీ.. థియేటర్ల కొరత కంటే తన సినిమా విడుదలవ్వడమే ఇంపార్టెంట్ అని భావించిన వర్మ ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదల చేస్తున్నాడు. సినిమా విడుదల విషయంలో వర్మ పంతం నెగ్గించుకొన్నాడు సరే.. మరి సినిమా ఏరేంజ్ లో ఉంటుంది, కనీస స్థాయిలో ఆకట్టుకోగలుగుతుందా లేక వర్మ మునుపటి సినిమాల్లా ఇలా వచ్చి.. రిలీజ్ అయ్యిందనే విషయం జనాలకి తెలియకుండానే థియేటర్ల నుంచి గెంటివేయబడుతుందా అనేది చూడాలి.