ఇ.వి.వి బాధ పెట్టిన సినిమా అదే..?

దివంగత దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాణ గారి గొప్పతనం గురించి మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా తక్కువే. కె.రాఘవేంద్ర రావు గారు స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న రోజుల్లో ఆయనకి గట్టి పోటీ ఇచ్చి అంతకు మించిన హిట్లు అందుకున్నాడు ఈయన. అందులోనూ రాఘవేంద్ర రావు గారు స్టార్ హీరోలతో సినిమాలు చేసి హిట్లు కొట్టేవారు.. కానీ చిన్న హీరోలు, మీడియం హీరోలతో కూడా హిట్లు, సూపర్ హిట్లు కొట్టి .. ఆయన్ని టెన్షన్ పెట్టిన దర్శకుడు ఇ.వి.వి అని ఎంతో మంది చెబుతుంటారు. ఆయన సినిమాల్లో కామెడీకి పెద్ద పీట వేసేవారు. అప్పట్లో చాలా బాధగా ఉంటే.. మద్యం వదిలేసి ఇ.వి.వి సినిమాలు చూడండి అంటూ జోకులు కూడా వేసుకునే వారట.

ఈయన సినిమాల్లో నాన్ స్టాప్ కామెడీ ఉండేది. ఇప్పటికీ ఇ.వి.వి గారి సినిమాలు చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే అలాంటి ఇ.వి.వి గారు తన మొదటి సినిమా ప్లాప్ అయ్యిందని… గోదావరిలో దూకి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకున్నారట. ఓ సారి రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు.. ఈ అఘాయిత్యానికి పాల్పడడం అనుకుని.. మళ్ళీ తన పిల్లలు, భార్య గుర్తొచ్చి ఆగిపోయారట. ఇ.వి.వి సత్యనారాణ గారు రాజేంద్ర ప్రసాద్ ను హీరోగా పెట్టి తీసిన చెవిలో పువ్వు చిత్రం పెద్ద ప్లాప్ అయ్యింది. దాంతో ఇక అవకాశాలు రావేమో అని భావించి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

అయితే సినిమాని డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చాను .. మరో ఛాన్స్ రాకపోతే కో డైరెక్టర్ గానే పనిచేసుకుంటాను అని డిసైడ్ అయ్యారట. ఆ తరువాత ఈయన ప్రతిభను గుర్తించిన దివంగత నిర్మాత రామానాయుడు గారు ‘ప్రేమఖైది’ అనే చిత్రం చేసే ఛాన్స్ ఇచ్చారట. అది పెద్ద హిట్ అయ్యింది. దీంతో వరుస అవకాశాలు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి… అంటూ ఆయన చిన్న కొడుకు అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ‘ప్రేమఖైది’ చిత్రం విడుదలయ్యి 30 ఏళ్ళు పూర్తిచేసుకోవడం విశేషం.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus