ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు ఎన్టీఆర్, చరణ్ ఖాతాలో స్పెషల్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో ఫస్టాఫ్ లో ఎన్టీఆర్ కు ఎక్కువగా ప్రాధాన్యత దక్కితే సెకండాఫ్ లో చరణ్ కు ఎక్కువగా ప్రాధాన్యత దక్కింది. ఆర్ఆర్ఆర్ సినిమా నిడివి మూడు గంటలు అయినప్పటికీ ప్రేక్షకులకు ఈ సినిమా ఏ మాత్రం బోర్ కొట్టలేదు. అయితే సినిమాలో సెకండాఫ్ లో ఎన్టీఆర్ కు సంబంధించిన అద్భుతమైన సీన్ డిలీట్ అయిందని సమాచారం.
ఆర్ఆర్ఆర్ లో నటించిన ఒక నటుడు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జైలులో భీమ్ కు తోటి ఖైదీలుగా తాము నటించామని గాయాలతో ఉన్న భీమ్ దగ్గరకు వెళ్లి మేము బ్రిటిష్ వాళ్లపై పోరాటం చేస్తుంటే మీరు బ్రిటిష్ వాళ్లను భయపెట్టారని చెబుతామని ఇకపై భీమ్ తమ నాయకుడు అని చెప్పే ఆ సీన్ అద్భుతంగా వచ్చిందని ఆ నటుడు అన్నారు. ఎన్టీఆర్ తో కలిసి రెండు రోజుల పాటు ఆ సీన్ షూట్ లో పాల్గొన్నానని నటుడు వెల్లడించారు.
ఆ తర్వాత ఆ సన్నివేశాన్ని తొలగించామని చెప్పి అజయ్ దేవగణ్ ఉండే సీన్లలో నటించడానికి తనను పిలిపించారని నటుడు పేర్కొన్నారు. జక్కన్న ఎడిటింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని హీరోలకు ఎలివేషన్ ఇచ్చే సన్నివేశాలను అదే విధంగా ఉంచి ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ రోజులు గడుస్తున్నా భాషతో సంబంధం లేకుండా భారీగా కలెక్షన్లను సాధిస్తోంది. కేజీఎఫ్2 సినిమా విడుదల కాకపోయి ఉంటే ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దర్శకధీరుడిగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న రాజమౌళి ఈ సినిమాతో దర్శకుడిగా మరో మెట్టు పైకి ఎక్కాడని చెప్పవచ్చు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత జక్కన్నతో పని చేయడానికి చాలామంది స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. రాజమౌళి తర్వాత సినిమా మహేష్ హీరోగా తెరకెక్కనుంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!