టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం గురించి తెలియని సినిమా ప్రేక్షకుడు ఉండడు. ఎలాంటి పాత్ర చేసినా కూడా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించడం ఆయనకే సొంతం. వేలాది సినిమాల్లో నటించిన బ్రహ్మానందం ఈ మధ్య కాస్త స్లో అయ్యారు. అయినప్పటికీ ఆయన పేరు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటుంది. మీమ్స్ లో బ్రహ్మీ ఫేస్ వాడకుండా ఉండలేరు. ఇక ఆయన పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా బయటకు చెప్పుకోరు.
అయితే బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులు ఉన్నారనే విషయం కూడా చాలా మందికి తెలియదు. కేవలం పెద్ద కుమారుడి గురించే తెలుసు. పెద్ద కుమారుడు రాజా గౌతమ్, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో పల్లకిలో పెళ్లి కూతురు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తరువాత బసంతి అనే సినిమా చేశాడు. అలాగే మను అనే సినిమాలో కూడా నటించాడు కానీ వర్కౌట్ కాలేదు. ఇక రెండవ కుమారుడి గురించి ఎవరికి తెలియదు.
అతని పేరు సిద్దార్థ్. నిజానికి బయట జనాలకు సిద్దార్థ్ గురించి పెద్దగా తెలియదు. విదేశాల్లో చదువుకున్న సిద్దార్థ్ ఈమధ్యనే స్వదేశానికి చేరుకున్నాడు. అతనికి సినిమా ఇండస్ట్రీలోకి రావడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదని సమాచారం. ఏదైనా బిజినెస్ తోనే కెరీర్ ను సరికొత్తగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడట. బ్రహ్మానందంకు కొడుకును హీరోగా చూసుకోవాలని ఉన్నప్పటికీ అతని నిర్ణయాన్ని కూడా గౌరవిస్తూన్నట్లు అర్ధమవుతోంది.
Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!