‘అల వైకుంఠపురములో’ తర్వాత మాటల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ (Jr NTR) సినిమా త్రివిక్రమ్ తోనే ఉంటుందని ఆ టైంలో అంతా అనుకున్నారు. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా కోవిడ్ కారణంగా ఆలస్యం అయ్యింది. ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రాజెక్టుతో ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో త్రివిక్రమ్ కి వేరే స్టార్ హీరో అందుబాటులో లేకుండా అయిపోయింది. అయినప్పటికీ మహేష్ బాబుతో సినిమా సెట్ చేసుకున్నారు త్రివిక్రమ్.
‘అతడు’ ‘ఖలేజా’ తర్వాత వీరి కాంబినేషన్లో ఓ హై ఆక్టేన్ యాక్షన్ సినిమా రాబోతున్నట్లు ప్రకటించారు. దానికి ‘ఓజి’ అనే టైటిల్ ని నిర్మాత నాగవంశీ రిజిస్టర్ చేయించారట. వాస్తవానికి ఇది ఎన్టీఆర్ కోసమే నాగవంశీ రిజిస్టర్ చేయించడం జరిగింది. కానీ అదే కథని మహేష్ (Mahesh Babu) తో చేస్తున్నారు కాబట్టి.. ఆ టైటిల్ ని వాడుకోవాలని అనుకున్నారు. దాదాపు 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కె.జి.ఎఫ్ స్టంట్ మాస్టర్స్ తో భారీ యాక్షన్ సీన్స్ తీశారు.
కానీ కట్ చేస్తే.. తర్వాత కథ మొత్తం మార్చేశారు. పూజా హెగ్డే తో పాటు సునీల్ వంటి చాలా మంది ఆర్టిస్టులతో తీసిన ఫుటేజీ మొత్తం డస్ట్ బిన్లో పడేసినట్టు అయ్యింది. తర్వాత ‘ఓజి’ టైటిల్ ను కూడా పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఇచ్చేసి ‘గుంటూరు కారం’ గా టైటిల్ పెట్టారు. ఆ తర్వాత జరిగిన కథ.. ఆ సినిమా ఫలితం అందరికీ తెలిసిందే. సో ఎన్టీఆర్ (Jr NTR) కోసం అనుకున్న ‘ఓజి’ టైటిల్ మహేష్ బాబుకి.. (Mahesh Babu) ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లడం జరిగిందన్న మాట.