Kalki: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ నుండి గూజ్ బంప్స్ తెప్పించే అప్డేట్..!

2024 సంక్రాంతి కానుకగా ‘హనుమాన్’ సినిమా రిలీజ్ అయ్యింది. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకుడు. టీజర్, ట్రైలర్స్ తో భారీ హైప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకులకి ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ను కలుగజేసింది. అతి తక్కువ బడ్జెట్ లో రూపొందిన ‘హనుమాన్’ సినిమా రూ.270 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. ముఖ్యంగా క్లైమాక్స్ కి ప్రేక్షకులు బాగా ఇంప్రెస్ అయిపోయారు. ‘హిమాలయాల్లో హనుమంతుడు కొలువై ఉన్నాడు’ అనేది కొంతమంది జనాల నమ్మకం.

చాలా మందికి అది నిజమా? కాదా? అనే అంశం పై ఎక్కువ డిస్కషన్స్ పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అది నిజమైతే బాగుణ్ణు అని కూడా చాలా మంది అనుకున్నారు. అలాంటి వారికి క్లైమాక్స్ లో హిమాలయాల్లో ఉన్న హనుమంతుడు వచ్చి హీరోని సేవ్ చేసినట్టు చూపించాడు ప్రశాంత్ వర్మ. అది ప్రేక్షకులకి గూజ్ బంప్స్ తెప్పించింది. అలాంటి క్లైమాక్స్.. కాదు కాదు అంతకు మించిన క్లైమాక్స్ ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 AD’ లో కూడా ఉంటుందట.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ ఓ రేంజ్లో ఉంటాయట. ఈ సినిమా కథ కూడా పురాణాల స్ఫూర్తితో ఉంటుందట. క్లైమాక్స్ లో డివోషనల్ టచ్ కూడా ఎక్కువగానే ఉంటుందట. ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ కూడా క్లైమాక్స్ లో కనిపిస్తారట. మరో రెండు రోజుల్లో క్లైమాక్స్ షూట్ ప్రారంభం కానుంది.

నెల రోజుల పాటు ఈ క్లైమాక్స్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతాయట. కనీ వినీ ఎరుగని రేంజ్లో ‘కల్కి 2898 AD’ క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుతున్నట్టు తెలుస్తుంది. ‘ ‘హనుమాన్’ కి పది రెట్లు’ అనేలా ‘కల్కి 2898 AD’ క్లైమాక్స్ ఉండబోతుందని తెలుస్తుంది. సమ్మర్ కానుకగా మే 9 న (Kalki) ‘కల్కి 2898 AD’ ని విడుదల చేయాలని చిత్ర బృందం అహర్నిశలు శ్రమిస్తోంది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus