యూట్యూబ్ లో రోజుకి షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో అప్లోడ్ అవుతుంటాయి. లక్షల్లో వ్యూస్ అందుకుంటుంటాయి. కానీ కొన్ని మాత్రం మన ఆలోచనల్ని కుదిపేస్తాయి. కొత్త ప్రశ్నలను రేకెత్తిస్తాయి. మెదడుకు పదును పెడుతాయి. అటువంటి కేటగిరీకి చెందిన లఘు చిత్రం “వర”.
కథలోకి వెళితే.. సైన్స్ ప్రొఫిసర్ తో కలిసి విద్యార్థి వాత్సవ్ కొత్త థియరీని ఆవిష్కరించడానికి అంటార్కిటికా ప్రాంతానికి వెళ్లి పరిశోధిస్తుంటాడు. తాను ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నప్పటికీ, అంటార్కిటికాలో లభించిన ఒక పదార్ధానికి వయసును కనుగొంటాడు. ఆ పదార్ధం వయసు ఎంత? ఆ పదార్ధం ఎక్కడ నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? అనే అనేక విషయాలు వివరించడమే కథ.
నటీనటులు, టెక్నీషియన్స్ పనితీరు.. వాత్సవ్ గా వినోద్, ప్రొఫెసర్ గా రామకృష్ణ చక్కగా నటించారు. థియరీని వివరించే సమయంలో రామకృష్ణ నటన కాసేపు మనల్ని క్లాస్ రూంలోకి తీసుకెళుతుంది. అలాగే ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతూ కొత్త విషయాన్నీ కనుకొనాలనే తపనపడే విద్యార్థిగా వినోద్ పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. రీ బట్టర్ నేపథ్య సంగీతం ఫిల్మ్ కి కొత్త ఫీల్ ని తెచ్చింది. కెమెరామెన్ విశ్వనాధ్ రెడ్డి పనితనం, గ్రాఫిక్ మాయాజాలం, విద్యాధర్ దర్శకత్వ ప్రతిభ కలిసి ఆడియన్స్ కి విశ్వాన్ని కళ్ళముందుకు తెచ్చాయి.
చివరగా.. ఒక కాఫీ షాపులో .. నాలుగు పంచ్ డైలాగులతో షార్ట్ ఫిల్మ్ ని ముగించేస్తున్న ఈ సమయంలో యూనివర్సల్ సబ్జెక్టు తీసుకొని దైర్యంగా “వర” ని నిర్మించిన నిర్మాత కార్తీక్ శబరీష్ అభినందనీయులు. ఇటువంటి కొత్త కథలను ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలను షార్ట్ ఫిలిమ్స్ రంగంలో మనం చూడవచ్చు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.