Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!

అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 21, 2020 / 09:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!

కన్నడలో సంచలన విజయం సాధించిన “ఆ కరాళ రాత్రి” అనే చిత్రానికి అఫీషియల్ రీమేక్ గా రూపొందిన చిత్రం “అనగనగా ఓ అతిధి”. పాయల్ రాజ్ పుత్, చైతన్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఇవాళ (నవంబర్ 20) ఆహా యాప్ లో విడుదలైంది. మరి కన్నడలో సాధించిన అఖండ విజయాన్ని తెలుగు వెర్షన్ రీక్రియెట్ చేసిందో లేదో చూద్దాం.

కథ: మల్లి (పాయల్ రాజ్ పుత్) ఒకప్పుడు బాగా బ్రతికి, తండ్రి (ఆనంద్ చక్రపాణి) తాగుడు వల్ల అప్పులపాలై.. స్వంత పొలానికి వడ్డీ కడుతూ కటిక దరిద్రాన్ని అనుభవిస్తుంటుంది. ఈ క్రమంలో వారి ఇంటికి శ్రీనివాస్ (చైతన్యకృష్ణ) వస్తాడు. సుఖంగా బ్రతకడానికి కావాల్సినంత డబ్బు సంపాదించి, సరదాగా దేశాటన చేస్తుంటాడు. ఒక రోజు విడిది కోసం మల్లి ఇంట్లో ఉంటాడు. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో.. శ్రీనివాస్ దగ్గరున్న డబ్బు, నగలు చూసి మల్లి & కో మొత్తానికి దురాశ మొదలవుతుంది. ఈ దురాశ ఎలాంటి దుర్మార్గానికి దారి తీసింది అనేది “అనగనగా ఓ అతిధి” కథ.

నటీనటుల పనితీరు: పాయల్ రాజ్ పుత్ ను చూస్తుంటే.. ఎందుకో మాడ వెంకటేశ్వర్రావు గారు గుర్తొస్తారు. మాడా పాత్ర పోషించిన తర్వాత ఆయన కెరీర్ లో మరో వైవిధ్యమైన పాత్ర దొరకలేదు. ఇప్పుడు పాయల్ పరిస్థితి కూడా అంతే. ఆమెలో చక్కని నటి ఉన్నప్పటికీ.. దర్శకులందరూ ఆమెలోని శృంగార రసాన్ని లీటర్ల కొద్దీ పిండుకొంటున్నారు తప్పితే.. ఆమె నట ప్రతిభను మాత్రం పట్టించుకోవడం లేదు. పాయల్ ఇమేజ్ పుణ్యమా అని సినిమాలో మెయిన్ ట్విస్ట్ కూడా పేలవమైపోయింది. దానికితోడు ఆ డబ్బింగ్ అస్సలు సెట్ అవ్వలేదు. ఆమెకు మాత్రమే కాదు ఆనంద్ చక్రపాణికి కూడా డబ్బింగ్ అస్సలు సింక్ అవ్వలేదు.

చైతన్యకృష్ణ తన పాత్రకు న్యాయం చేయడానికి విశ్వప్రయత్నం చేసాడు కానీ.. క్యారెక్టర్ డీటెయిలింగ్ సరిగా లేకపోవడంతో ఆ క్యారెక్టర్ కు కూడా ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వలేరు.

సాంకేతికవర్గం పనితీరు: ఆరోల్ కర్రోల్ కెమెరా వర్క్ తప్ప సాంకేతికపరంగా చెప్పుకోదగ్గ ప్రతిభ కనబరిచినవారు ఒక్కరూ లేరు. ప్రొడక్షన్ డిజైన్ & సెట్ వర్క్ అయితే చాలా చీప్. డైలాగ్స్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. తక్కువ బడ్జెట్ లో ఒక వెబ్ ఫిలిం ఎలా తీయాలని అనేందుకు చక్కని ఉదాహరణగా ఆహా వారి “కమిట్ మెంటల్” నిలిస్తే.. బ్యాడ్ ఎగ్జామ్పుల్ గా “అనగనగా ఓ అతిధి”ని పేర్కొనవచ్చు.

కన్నడ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన దయాళ్ పద్మనాభన్ తెలుగు వెర్షన్ కు కూడా దర్శకత్వం వహించినప్పటికీ.. కథలోని ఆత్మను, మ్యాజిక్ ను రీక్రియెట్ చేయలేకపోయాడు. నటీనటుల ఎంపికలోనే మొదటి వైఫల్యం చవిచూశాడు. కథ బట్టి పాత్రలు ఉండాలి కానీ.. నటీనటుల బట్టి కథ ఉండకూడదు అనే చాలా చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడో అర్ధం కాలేదు.

విశ్లేషణ: డిజిటల్ స్పేస్ ను సరిగా వినియోగించుకోలేకపోయిన మరో చిత్రంగా “అనగనగా ఓ అతిధి” మిగిలిపోయింది. పాయల్ ఇప్పటికైనా శృంగార తారగా కాక నటిగా గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని తెలియజెప్పిన చిత్రమిది.

రేటింగ్: 2/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anaganaga O Athidhi Movie
  • #Anaganaga O Athidhi Movie Review
  • #Chaitanya Krishna
  • #Dayal Padmanabhan
  • #Payal Rajput

Also Read

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

related news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

1 hour ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

2 hours ago
Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

2 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago
Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

20 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’ మొదలైంది.. ఎట్టకేలకు ప్రశాంత్‌ వర్మ బయటకు..

Jai Hanuman: ‘జై హనుమాన్‌’ మొదలైంది.. ఎట్టకేలకు ప్రశాంత్‌ వర్మ బయటకు..

32 mins ago
Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

35 mins ago
Toxic: ‘టికెట్‌’ అదిరిపోయాడుగా.. ‘టాక్సిక్‌’లో ఇతను చాలా స్పెషల్‌ అట!

Toxic: ‘టికెట్‌’ అదిరిపోయాడుగా.. ‘టాక్సిక్‌’లో ఇతను చాలా స్పెషల్‌ అట!

47 mins ago
Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

53 mins ago
Madhavan: ఆ సీన్‌ చూసి ఏడ్చేచేశారట.. ‘ధురంధర్‌’లో జరిగిన విషయం చెప్పిన మాధవన్‌

Madhavan: ఆ సీన్‌ చూసి ఏడ్చేచేశారట.. ‘ధురంధర్‌’లో జరిగిన విషయం చెప్పిన మాధవన్‌

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version