స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో అన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఇతర భాషల హీరోలు సైతం రాజమౌళి సినిమాలో చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చినా వదులుకోవడానికి ఇష్టపడరనే సంగతి తెలిసిందే. జక్కన్న సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో పౌరాణిక సినిమాలను కూడా తెరకెక్కి్చాలని భావించారు. అయితే ఆనంద్ మహీంద్ర తాజాగా తన ట్విట్టర్ లో సింధూ నాగరికతకు సంబంధించిన ఫోటోను షేర్ చేయడంతో పాటు ఈ తరహా చిత్రాలు మన చరిత్రకు జీవం పోస్తాయని మన ప్రతిభను ప్రతిబింబిస్తాయని నాటి పరిస్థితులు ప్రపంచానికి తెలిసేలా వీటి గురించి ఒక సినిమా తీయగలరా అంటూ రాజమౌళిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయింది. ఈ ట్వీట్ తన దృష్టికి రావడంతో రాజమౌళి స్పందిస్తూ మేము మగధీర మూవీ షూటింగ్ ను ధోలావీరాలో చేశామని ఆ టైమ్ లో అక్కడ ఉన్న చెట్టు నన్ను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన అన్నారు. ఆ చెట్టు ఆధారంగా సింధు నాగరికత ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఏ విధంగా అంతరించిందో సినిమా తీయాలనే ఆలోచన వచ్చిందని రాజమౌళి కామెంట్ చేశారు.
ఈ ఘటన జరిగిన కొన్నేళ్ల తర్వాత (Anand Mahindra) నేను పాకిస్థాన్ కు వెళ్లానని రాజమౌళి వెల్లడించారు. అక్కడ మొహంజోదారాకు వెళ్లి రీసెర్చ్ చేయడానికి ప్రయత్నించానని జక్కన్న చెప్పుకొచ్చారు. కానీ నాకు అనుమతులు రాలేదని సాడ్ ఎమోజీతో రాజమౌళి సమాధానమిచ్చారు. జక్కన్న ఇచ్చిన ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాబోయే రోజుల్లో రాజమౌళి సింధు నాగరికతతో సినిమా తెరకెక్కిస్తారేమో చూడల్సి ఉంది. రాజమౌళి ప్రస్తుతం మహేష్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. రాజమౌళి రెమ్యునరేషన్ ప్రస్తుతం 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.
ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!
బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా