Ananya Panday: అనన్యపాండే డేర్ చూసి ఫిదా అవ్వతున్నఫ్యాన్స్..!

గ్లామరస్ బ్యూటీ అనన్య పాండే గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లైగర్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. టాలీవుడ్ లో మొదటి సినిమానే ఫ్లాప్ అవడంతో ఈమె చాలా నిరాశ పడిపోయింది. కానీ బాలీవుడ్ లో బాగానే అవాకాశాలు దక్కించుకుంటూ ముందుకెళ్తోంది. అనన్య పాండే ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె. అనన్య పాండే తక్కువ సమయంలోనే పేరు తెచ్చుకుంది.

అనన్య పాండే (Ananya Panday) వైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఇప్పుడు అనన్య పాండే సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారాయి. అనన్య పాండే ఇన్ స్టా గ్రాం పోస్ట్ చూసి నెటిజన్లు స్టన్ అవుతున్నారు.

సాధారణంగా లేడీస్ బొద్దింకలను, కప్పలను, బల్లులను చూసి భయపడుతుంటారు..అలాంటి అనన్యపాండే ఏకంగా పాములతోనే ఆడుకుంటూ షాకిచ్చింది. కొండచిలువను చేతిలో తీసుకుంటూ మెడలో వేసుకొని నవ్వుతూ స్టిల్స్ ఇచ్చింది. అనన్య పాండే పిక్స్ ని చూసి వావ్ అంటున్నారు ఫ్యాన్స్. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. డేరింగ్ గర్ల్ అని కామెంట్లు పెడుతూ పొగిడేస్తున్నారు.

స్నేక్ లేడీ అంటు నెటినన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ బీ టౌన్ బ్యూటీ చేసిన పోస్ట్ కు వేలల్లో కామెంట్లు లక్షల్లో లైక్స్ వచ్చాయి. ప్రస్తుతానికి అనన్యపాండే ఖో గయే హమ్ కహా మూవీ రిలీజ్ కు ఉండగా..కంట్రోల్, శంకర్ సినిమాలు.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus