Anasuya: ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టి మమ అనిపించిన అనసూయ..!

స్టార్ యాంకర్‌ అనసూయ బుల్లితెర పైనే కాకుండా వెండితెర పై కూడా ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బుల్లితెర పై చేసే గ్లామర్ షో ఈమె వెండితెర పై చేయదు. ఇక్కడ మాత్రం మంచి పాత్రలను జనాలకు గుర్తుండిపోయే పాత్రలనే ఆమె చేస్తూ వస్తుంది. తాజాగా ‘దర్జా’ అనే చిత్రంతో ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో కనకమహాలక్ష్మీ అలియాస్ బందరు కనకం పాత్రలో ఆమె నటించింది.

ఈ చిత్రంలో ఆమె ఓ లేడీ డాన్ పాత్రలో.. చాలా క్రూయల్ గా నటించింది. ఎంత క్రూయల్ గా నటించినా.. ఈమె గ్లామర్ గానే కనిపిస్తుంది. ఈ సినిమా లుక్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన అనసూయ ” ‘దర్జా’ సినిమా ఇక మీది. థియేటర్స్‌‌లో సందడి చేస్తోంది” అంటూ రాసుకొచ్చింది.ఈ సినిమా ప్రమోషన్లకు అనసూయ ఎక్కువగా హాజరు కాలేదు అనే కంప్లైంట్ ఉంది. నిజంగానే ఆ సినిమా ప్రమోషన్ల వేడుకల్లో ఆమె దర్శనమిచ్చింది లేదు.

ఫైనల్ గా ఓ పోస్ట్ పెట్టి ఆ సినిమాకి గుడ్ బై చెప్పేసింది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ‘దర్జా’ లోని గెటప్ లో అద్దం ముందు సెల్ఫీ తీసుకుంటున్నట్టు ఆమె ఇచ్చిన ఫోజులు సూపర్ అనే విధంగా ఉన్నాయి అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇక 9 ఏళ్లుగా ‘జబర్దస్త్’ లో యాంకర్ గా చేస్తూ వచ్చిన అనసూయ

ఈ మధ్యనే ఆ షో కి గుడ్ బై చెప్పిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆమె మా టీవీలో వచ్చే స్పెషల్ షో లో జడ్జిగా కనిపిస్తూ ఉండటం గమనార్హం.అంతేకాకుండా త్వరలోనే ‘కన్యాశుల్కం’ అనే వెబ్‌ సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకు రానుంది అనసూయ.

1

2

3

4

5

6

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus