Anasuya: కొత్త డైరెక్టర్ తో హాట్ యాంకర్!

టాలీవుడ్ లో హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. టీవీ షోలతో పాటు సినిమాల్లో కూడా నటిస్తుంది. ఆమె నటించిన ‘క్షణం’, ‘రంగస్థలం’ వంటి సినిమాలు నటిగా అనసూయకి మంచి పేరుని తీసుకొచ్చాయి. ఇదే జోరులుగా ఆమె కొన్ని సినిమాల్లో నటించింది. కానీ అవి ప్రేక్షకులను నిరాశకు గురిచేశాయి. రీసెంట్ గా ‘థాంక్యూ బ్రదర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనసూయ. ఇందులో ఆమె గర్భవతిగా చక్కటి నటనను కనబరిచింది.

ఇదిలా ఉండగా.. తాజాగా అనసూయ మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుందని సమాచారం. దర్శకుడు సంపత్ నంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఓ వ్యక్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పనులన్నీ సంపత్ నంది దగ్గరుండి చూసుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో అనసూయ మరో డిఫరెంట్ రోల్ లో కనిపించబోతుందని తెలుస్తోంది.

ప్రస్తుతం అనసూయ.. సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె సునీల్ కి భార్యగా కనిపించనుంది. అలానే రవితేజ నటిస్తోన్న ‘ఖిలాడీ’, మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. వీటితో పాటు కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తోన్న ‘రంగమార్తాండ’ సినిమాలో అనసూయ కీలకపాత్ర పోషిస్తోంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus