Rashmi Gautam: యాంకర్ రష్మీ ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ఏమైందంటే?
- August 21, 2024 / 07:47 PM ISTByFilmy Focus
టాలీవుడ్ యాంకర్లలో ఒకరైన రష్మీ (Rashmi Gautam) అందరికీ సుపరిచితమే. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో నటించినప్పటికీ.. ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే ‘జబర్దస్త్’ కామెడీ షో ఈమెకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. సోషల్ మీడియాలో కూడా రష్మీ ఫాలోవర్స్ సంఖ్య చాలా ఎక్కువ. ఆమె ఎటువంటి పోస్ట్ పెట్టినా ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. అయితే ఆమె పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అదేంటంటే.. రష్మీ ఇంట్లో విషాదం చోటు చేసుకుందట.
Rashmi Gautam

దీంతో ఆమె ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆమె తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ…”ఫైనల్ గా మాా తాతయ్య స్వర్గంలో ఉన్న మా బామ్మను కలుసుకున్నారు. ఆగస్టు 17న ఆయన కాలం చేయడం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన మా తాతగారికి తుది వీడ్కోలు పలికాము. మా బామ్మ తాతయ్య..ల మనసులు విడదీయలేనివి. మా బామ్మ మరణించాక ఆయన మానసికంగా ఎంత బాధపడ్డారో మాకు తెలుసు.

ఏడాదిన్నర నుండి అయితే మా బామ్మపై ఎక్కువగా బెంగ పెట్టుకున్నారు. ఆమె గురించి ఎక్కువగా మాకు చెబుతూ వచ్చారు. మా అవసరాల నిమిత్తం బామ్మ, తాతయ్యలు మాతోనే ఉండాలని ఆశపడ్డాం. కానీ మా తాతకి మా బామ్మ పై ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అర్ధమయ్యింది” అంటూ ఆమె బామ్మ, తాతయ్య..లు అన్యోన్యంగా ఉన్న ఫోటోని షేర్ చేసి ఎమోషనల్ అయ్యింది రష్మీ.













