Anchor Rashmi: షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో యాంకర్ రష్మీకి చేదు అనుభవం..!

సాధారణంగా సినిమా వాళ్ళు బయటకనిపిస్తేనే వారి చుట్టూ జనాలు గుమికూడతారు. సెల్ఫీల మూక మరోపక్క దాడి చేస్తుంటారు. బౌన్సర్లు ఎంత కంట్రోల్ చేయాలని ప్రయత్నించినా… వాళ్ళు పూర్తిశాతం చేయలేరు. హీరోయిన్ల విషయంలో అయితే దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. పోలీసులు రంగంలోకి దిగినా కంట్రోల్ చేయలేని పరిస్థితి నెలకొంటుంది.అలాంటిది అటు బౌన్సర్లు ఇటు పోలీస్ సిబ్బంది లేకపోతే ఆ నటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా యాంకర్ రష్మీకి ఇలాంటి అనుభవమే ఎదురైంది. యాంకర్ రష్మీకి స్టార్ హీరోయిన్ల రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఆమె సోమవారం నాడు చిత్తూరు సిటీలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వెళ్ళింది. రష్మీ వస్తుందని తెలుసుకున్న అక్కడి జనాలు.. ఆ షాపింగ్ మాల్ వద్దకి వందల సంఖ్యలో వచ్చి చేరారు. రష్మీని చూడ్డానికి ఎగబడ్డారు.మరీ ముఖ్యంగా కుర్రకారు అయితే రష్మీని చూడడానికి అలాగే షాక్ హ్యాండ్ లు ఇవ్వడానికి ఆమె చుట్టూ చేరి ఆమె మీద పడుతూ వచ్చారు. వారి మధ్య రష్మీ ఎక్కువ సేపు చిక్కుకుపోయింది.ఆ టైములో ఏమి చేయలేక రష్మీ సైలెంట్ గా ఉండిపోయింది.

షాపింగ్ మాల్ యాజమాన్యం ఎక్కువ మంది సిబ్బందిని పెట్టుకోకపోవడం వలన ఈ పరిస్థితి నెలకొందని స్పష్టమవుతుంది. ఈ విషయమై వారిని చాలా మంది తప్పుబడుతున్నారు. అయితే తర్వాత షాపింగ్ మాల్ యాజమాన్యమే వచ్చి రష్మీని లోపలికి తీసుకువెళ్లారు. యాంకర్ కాబట్టి.. జనాలు ఎక్కువ శాతం రారు అని వారు భావించి ఉండొచ్చు. అందుకే రష్మీకి ఈ చేదు అనుభవం ఎదురైంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus