Varshini: ”పెళ్లయ్యాక నీ భర్తతో ఇలానే చేయిస్తావ్ కదా”

ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో సెలబ్రిటీలంతా ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తమ లెట్స్ ఫోటోలను, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ రచ్చ చేస్తున్నారు. తాజాగా యాంకర్ రవి పోస్ట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన మరో యాంకర్ వర్షిణి దానిపై చేసిన కామెంట్, దానికి రవి ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ మధ్యకాలంలో వంట వీడియోలతో హల్చల్ చేస్తోన్న రవి తాజాగా.. ‘వకీల్ సాబ్’ సినిమాలో ‘మగువా మగువా’ అనే పాటకు స్పూఫ్ గా ‘పురుషా పురుషా’ అనే వీడియో చేశాడు. ఇందులో రవి ఇంట్లో పని మొత్తం తనే చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. ఇక ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వెంటనే లేడీ యాంకర్లంతా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ‘నీకంత సీన్ లేదని.. నీ భార్యతో పనులు చేయించి కావాలని ఇలా రీల్ వీడియో అప్లోడ్ చేసి ఉంటావ్’ అంటూ కామెంట్స్ చేశారు.

ఈ క్రమంలోనే యాంకర్ వర్షిణి.. ”అయ్యో మా రవన్న ఏంటి ఇలా అయిపోయాడు.. కానీ చూడడానికి మాత్రం మస్త్ ఉంది” అంటూ కామెంట్ చేసింది. ఇది చూసిన రవి.. ‘సమాజంలో ప్రతి మగాడి పరిస్థితి ఇంతే కదా.. రేపు పెళ్లి తరువాత నీ మొగుడు కూడా ఇదే చేయాలి. నువ్వు చేయిస్తావు కూడా’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. వీరిద్దరి సరదా సంభాషణపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా చూసిన రవి భార్య నిత్య.. ‘మేకింగ్ వీడియో బయటపెట్టమంటావా..?’ అంటూ రవిని ఫన్నీగా బెదిరించింది.


టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus