Bigg Boss 5 Telugu: ఆ విషయంలో నిత్యా ఇండైరెక్ట్ గా రవికి హింట్స్ ఇచ్చిందా..?

బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తున్నారు. సన్నీ మదర్ కళావతి వచ్చి హౌస్ లో సందడి చేశారు. అంతేకాదు, కళావతి బర్త్ డే వేడుకలు కూడా హౌస్ లో జరుపుకోవడం అనేది హైలెట్ గా నిలిచింది. ఇక్కడే కేవలం సన్నీతోనే కాకుండా హౌస్ మేట్స్ అందర్నీ పలకరిస్తూ సందడి చేశారు ఆవిడ. ముఖ్యంగా సన్నీకి వాళ్ల మమ్మీతో ఉన్న బాండింగ్ చూస్తే హౌస్ మేట్స్ కి మంచి బూస్టప్ వచ్చినట్లుగా అయ్యింది. ఇక మరోవైపు రవి తన బిడ్డ వియా కోసం, అలాగే భార్య నిత్యాకోసం ఎదురుచూపులు మొదలుపెట్టాడు. ఫ్రీజ్ గేమ్ ఆడిస్తున్న బిగ్ బాస్ సడెన్ గా నిత్యాని లోపలకి పంపాడు.

దీంతో వియా రాలేదని రవికి అర్ధం అయ్యింది. నిత్యా కూడా వచ్చి వియా రాలేదని రవిని నమ్మించింది. అయితే, కాసేపటికే “పప్పా ఐ లవ్ యూ” అంటూ వియా వాయిస్ రాగానే రవి పరిగెత్తుకుని గేటు దగ్గరకి వచ్చాడు. పట్టరాని సంతోషంతో , బరువెక్కిన గుండెతో పాపని గుండెలకి హత్తుకుని ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత పాపతో హౌస్ మొత్తం తిరిగి సందడి చేశాడు. ఇక నిత్యా రవితో మాట్లాడుతూ గేమ్ గురించి ఎన్నో విషయాలని అర్ధమయ్యేలా చెప్పింది. ఫ్రాంక్ గా చెప్పాలంటే నువ్వు మా బలం. నీ ఫ్యాన్స్ నుంచీ ఎన్నో మెసేజస్ వస్తాయి. నువ్వు ఏడుస్తావ్ బయట ఎంతో మంది ఫ్యాన్స్ మెసేజస్ వస్తుంటాయి. నువ్వు ఎమోషనల్ అయితే తాతయ్య కూడా ఏడుస్తారు అంటూ చెప్పింది వియా.

ఇక్కడే ముగ్గురూ కాసేపు ఎమోషనల్ అయిపోయారు. తర్వాత నిత్యా రవితో మాట్లాడుతూ నీకు ఎన్ని పేర్లు పెట్టారు. అయినా కూడా నువ్వు ఎంత ఓపిగ్గా ఉన్నావ్ దాని గురించి అస్సలు ఆలోచించకు. నువ్వేంటో అందరికీ తెలుసు. నువ్వు ఎప్పుడూ సింపతీ వాడలేదు, అలాగే యాంగర్ అవ్వలేదు అంటూ తన గేమ్ ని పొగుడుతూ వచ్చింది. అందరూ స్ట్రాటజీలు వాడతారు. ఫిజికల్ టాస్క్ మాత్రమే కాదు, మైండ్ గేమ్ కూడా ఆడతారు. నువ్వ బయటకి చెప్తావ్ అందరూ చెప్పారు అదే తేడా అంటూ రవి గేమ్ గురించి చెప్పింది.

ఇక నుంచీ అస్సలు టెన్షన్ తీస్కోవద్దని చెప్పింది. నువ్వు అన్న మాటలు మర్చిపోయాను అని చెప్పు, అంతేకానీ గుర్తు చేసుకోవడానికి ట్రై చేయద్దు అంటూ సలహా ఇచ్చింది. ఇక్కడే తన గేమ్ గురించి కొన్ని సీక్రెట్స్ ని కూడా చెప్పింది. ఇక నిత్యా వియా వెళ్లిపోతుంటే రవి పరుగు పరుగున వెళ్లి రింగ్ తెచ్చి పెట్టి హ్యాపీ యానివర్సరీ అంటూ నిత్యాకి చెప్పాడు. అయితే, ఇక్కడ నిత్యా కానీ, హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ కూడా బయట ఓటింగ్ ఎలా ఉంది అనేది లీక్ చేయలేదు. ఎవరు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా చెప్పలేదు. అదీ మేటర్.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Share.