పవన్ కళ్యాణ్ ఆల్ టైం సూపర్ హిట్ మూవీ ‘తమ్ముడు’ (Thammudu) టైటిల్ ను నితిన్ వాడుకున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ‘కాంతార’ బ్యూటీ సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ వంటి హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ లయ ఈ చిత్రంతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ కూడా ఆర్గానిక్ గా నిర్వహించారు దిల్ రాజు. ట్రైలర్ లో సస్పెన్స్ ఎలిమెంట్స్, మేకింగ్ వాల్యూస్, యాక్షన్ బ్లాక్స్ అన్నీ బాగున్నాయి.
కానీ రిలీజ్ ట్రైలర్ ఎందుకో అంత ఇంపాక్ట్ చూపలేదు. అయినప్పటికీ ట్రైలర్ బాగా పేలింది. కచ్చితంగా సినిమాకి మంచి వైబ్ తీసుకొచ్చింది అని చెప్పాలి. జూలై 4న ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే దిల్ రాజు ఆల్రెడీ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది స్నేహితులకి, సినిమా సెలబ్రిటీలకు స్పెషల్ షోలు వేయడం జరిగింది.
వారి టాక్ ప్రకారం.. సినిమా 2 గంటల 34 నిమిషాల నిడివి కలిగి ఉందట. సినిమా స్టార్టింగ్ లో లయ ట్రాక్ ఎమోషనల్ గా సాగుతుందట. వెంటనే ఒక ట్విస్ట్ ఇచ్చి.. సినిమా ప్రజెంట్ కి వస్తున్నట్టు చూపిస్తారట. అటు తర్వాత నితిన్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది. సినిమా ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ నుండి మంచి హై ఇచ్చేలా ఉంటుందట. సెకండాఫ్ పై అంచనాలు పెంచుతుంది అని అంటున్నారు.
ఇక సెకండాఫ్ లో వచ్చే విలన్ ట్రాక్, ఎమోషనల్ సీన్స్, యాక్షన్ బ్లాక్స్ బాగుంటాయని అంటున్నారు. అజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి థియేట్రికల్ ఫీల్ ఇస్తుందని అంటున్నారు. మొత్తంగా ‘తమ్ముడు’ (Thammudu) ఓకే అనిపించే విధంగా ఉంటుందట. ఒకసారి కచ్చితంగా థియేటర్లలో చూడదగిన విధంగా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి జూలై 4 మార్నింగ్ షోల నుండి ఎలాంటి టాక్ వస్తుందో.