Shyamala: గతాన్ని తలుచుకుని ఎమోషనల్ అయిన యాంకర్ శ్యామల!

యాంకర్ శ్యామల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన శ్యామల అటు తర్వాత సినిమాల్లో కూడా నటించింది. ‘స్పీడున్నోడు’ ‘బెంగాల్ టైగర్’ ‘లౌక్యం’ ‘మిస్టర్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది కానీ అవేవి ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టలేదు. సో అక్కడ ఈమె పెద్దగా రాణించలేకపోయింది అనే కామెంట్లు వినిపించాయి. అయినప్పటికీ బుల్లితెర పై ఈమె మంచి ఆఫర్లే రాబట్టుకుంది.

పలు సినిమా ఫంక్షన్స్ కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ, సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ గట్టిగానే సంపాదిస్తుంది. మరోపక్క యూట్యూబ్ ఆదాయం ఎలాగూ ఉండనే ఉంది. ఇటీవల వచ్చిన ‘విరూపాక్ష’ సినిమాలో ఈమె హీరో సాయి ధరమ్ తేజ్ కి సోదరి పాత్రను పోషించింది. సినిమా కథని మలుపు తిప్పే పాత్ర ఈమెది అని చెప్పాలి. ఈ పాత్రలో శ్యామల చాలా నాచురల్ గా నటించింది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె గతాన్ని తలుచుకుని చేసిన ఎమోషనల్ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

ఈమె (Shyamala) మాట్లాడుతూ.. ‘పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. నరసింహ నా ప్రాజెక్టుల విషయంలో జోక్యం చేసుకోడు. ఇద్దరం మా పని మేము చేసుకుంటాం. నేను 8 నెలల గర్భిణీగా ఉన్నప్పుడు కూడా యాంకరింగ్ చేశాను. బాబు పుట్టాక గ్యాప్ వచ్చింది. ఇషాన్ కి 11 నెలల వయసున్నప్పుడు బిగ్ బాస్ 2 ఆఫర్ వచ్చింది. అలా ఆ రియాలిటీ షోకి వెళ్లాను. ఆ టైంలో నాపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.

ఇంత చిన్న బాబును వదిలేసి డబ్బు కోసం వెళ్తున్నావా? అంటూ నానా మాటలు అన్నారు. కానీ నేనేంటో మా ఫ్యామిలీకి తెలుసు, కాబట్టి ఆ మాటలను నేను పట్టించుకోలేదు. ఇక హౌస్ లో ఉన్నన్ని రోజులు నేనే హౌస్ మేట్స్ కి వండి పెట్టాను. కానీ నా పై కంప్లైంట్లు చేసేవారు. చివరికి నామినేట్ చేసి ఎలిమినేట్ చేశారు.’ అంటూ ఎమోషనల్ అయ్యింది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus