Ashu Reddy, Siva: అషూరెడ్డితో శివ నిజంగానే అసభ్యంగా మాట్లాడాడా..? అసలు జరిగింది ఇదే..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో 9వ వారం జరిగిన నామినేషన్స్ ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అషూరెడ్డి శివ తనతో మాట్లాడిన మాటలు నచ్చలేదంటూ నామినేట్ చేసింది. వాష్ రూమ్ దగ్గర నా టీషర్ట్ బటన్స్ తీసేయ్ అంటూ లోపల ఉన్నది అది కావాలంటూ అడిగావని అది నాకు అస్సలు నచ్చలేదంటూ ఇండైరెక్ట్ గా మేటర్ చెప్పి నామినేట్ చేసింది. దీంతో శివ లేడీ గెటప్ కోసం కావాలని అడిగాను తప్పితే వేరే ఉద్దేశ్యం లేదని మాట్లాడాడు. కానీ, అషూరెడ్డి మాత్రం ఈ విషయాన్ని నామినేషన్స్ లోకి తీస్కుని రావడంతో హౌస్ మేట్స్ తో పాటుగా, ఆడియన్స్ కూడా షాక్ తిన్నారు.

అసలు శివ ఎందుకు అషూని అలా అన్నాడు అని ఆ వీడియో కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు. అసలు యాంకర్ శివ అషూతో ఏం మాట్లాడాడు అంటే.., బిగ్ బాస్ హౌస్ లో లేడీ గెటప్ వేసినపుడు షూని తన జాకెట్, షాట్ రెండూ ఇమ్మని అడిగాడు. అలాగే, జాకెట్ లో వేసుకునే లో దుస్తులు కూడా ఇమ్మని చెప్పాడు. ఇదే టైమ్ లో శివ లో దుస్తులు అడిగేటపుడు నీ షర్ట్ బటన్ తీయ్. ఇంకోటి తీయ్.. అంటూ ఆ టైప్ ది కావాలి అంటూ అడిగాడు. అలాగే అప్పటికప్పుడు అషూరెడ్డి వేరే వాటిని ఇస్తూ అది ఇది ఒకటే వేసుకో అంటూ చెప్పింది.

అక్కడే అషూరెడ్డి చాలా క్యాజువల్ గా ఈ విషయాన్ని తీస్కుంది. దీనితో పాటు నా దగ్గర ఇంకో జాకెట్ ఉంది, షార్ట్ ఉంది అది కూడా ఇస్తా అంటూ అప్పుడు మాట్లాడింది. కానీ, నామినేషన్స్ అప్పుడు మాత్రం శివ పదే పదే షర్ట్ బటన్స్ తీసేయ్ అని అనడం నాకు నచ్చలేదంటూ నామినేట్ చేసింది. దీనికి శివ ఒక్కసారి షాక్ అయ్యాడు. దీనిపైన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేస్తోంది.

అసలు ఆడపిల్లని అలా అనడం ఏంటని శివకి వ్యతిరేకంగా కొంతమంది కామెంట్స్ చేస్తుంటే, టాస్క్ ఆడేటపుడు లో దుస్తుల పేర్లు తన నోటితో చెప్పకుండా అలా శివ తెలివిగా అడిగాడు అంటూ కొంతమంది చెప్తున్నారు. తను షర్ట్ వేసుకుని ఉంది కాబట్టి అలా అడిగాడు అని, అదే వేరే డ్రెస్ లో ఉంటే కనీసం చెవిలో అయినా చెప్పేవాడని శివని వెనకేసుకుని వస్తున్నారు. ఏది ఏమైనా శివ – అషూల ఈ లొల్లి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అదీ విషయం.

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన తెలుగు సినిమాల లిస్ట్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus