Sreemukhi: ఆ సింగర్ ప్రేమలో శ్రీముఖి.. మీకు తెలుసంటూ?

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో శ్రీముఖి ఒకరు ఈమె సుమ అనసూయ తర్వాత అదే స్థాయిలో యాంకర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఇటీవల కాలంలో వరుస బుల్లి తెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ శ్రీముఖి కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం మూడు పదుల వయసులోకి అడుగుపెట్టారు. దీంతో తరచూ శ్రీముఖి పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉంటాయి.

ఈమె హైదరాబాద్ కి చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ ఇదివరకు శ్రీముఖి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా శ్రీముఖి తనుకు ఒక లవర్ ఉన్నారని చెబుతూ అసలు విషయం బయట పెట్టారు. శ్రీముఖి ప్రస్తుతం సూపర్ సింగర్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ వింటేజ్ థీమ్ లో ప్లాన్ చేశారు.

సింగర్స్ పాత పాటలు పాడగా జడ్జెస్ రెట్రో లుక్ లో దర్శనం ఇచ్చారు. ఓ పాటకు జడ్జి అనంత శ్రీరామ్ తో కలిసి స్టెప్స్ వేసింది శ్రీముఖి. అనంత్ శ్రీరామ్ సాంగ్ లో భాగంగా శ్రీముఖి బ్యాక్ తడుతున్నట్లు గెస్చర్ ఇచ్చాడు. అనంత శ్రీరామ్ మాటలకు షాక్ అయినటువంటి శ్రీముఖి నువ్వు తుంటరోడివి అని నాకు ముందే తెలుసు. అందుకే నేను ఇతని ప్రేమిస్తున్నాను అంటూ…

రాహుల్ సిప్లిగంజ్ ని చూపించింది. రాహుల్ సిప్లిగంజ్ చిన్నగా నవ్వాడు. ఇది చూసినటువంటి ప్రేక్షకులు ఏంటి శ్రీముఖి రాహుల్ ని ప్రేమిస్తుందా అంటూ షాక్ అయ్యారు కానీ ఇదంతా షోలో భాగమని తెలుస్తోంది. ఇక వీరిద్దరూ బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొనగా రాహుల్ విన్నర్ కాగా శ్రీముఖి (Sreemukhi) రన్నర్ గా నిలిచారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus