Anchor Suma: చలాకీగా ఉండే సుమ ఆ విషయంలో అంత బాధ పడుతోందా?

బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా కొనసాగుతున్నటువంటి సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిత్యం సినిమా ఈవెంట్లు అవార్డు ఫంక్షన్లో అంటూ ఎంతో బిజీగా గడిపే ఈమె బుల్లితెర కార్యక్రమాలకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ మకుటం లేని మహారాణిగా కొనసాగుతున్నారు. గత రెండు దశాబ్దాల నుంచి నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతున్నటువంటి సుమ తెరపై ఎంతో చలాకీగా సందడిగా కనిపిస్తూ ఉంటారు.

వారంలో ఏడు రోజులపాటు సుమ ఎంతో బిజీగా గడుపుతూ ఏదో ఒక షూటింగ్లో పాల్గొంటూ ఉంటారు. అయితే ప్రతిరోజు ఇలా కష్టపడుతూ ఇంటికి వెళ్ళగానే ఓ విషయంలో సుమ ఎంతో ఎమోషనల్ అవుతున్నట్టు తెలుస్తుంది. సుమ తన వృత్తిపరమైన జీవితం నిమిత్తం పలు షూటింగులలో బిజీగా ఉండగా ఇంటికి వెళ్ళగానే తన అత్తయ్య ఫోటో చూసి ఆమె చాలా బాధపడతారని తన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

సుమ తన అత్తయ్యను తల్లి తర్వాత తల్లిగా భావించారు. అయితే ప్రస్తుతం ఆమె మరణించడంతో ఆమె లేని వెలితి స్పష్టంగా కనపడుతుందని సుమ తన సన్నిహితుల దగ్గర బాధపడినట్లు తెలుస్తోంది. తాను షూటింగ్ నిమిత్తం ఎంతో బిజీగా గడుపుతుండగా తన అత్తయ్య మాత్రం ఇంట్లో తన పిల్లలను ఎంతో బాధ్యతగా జాగ్రత్తగా చూసుకునేవారని, తన అత్తయ్య ఉన్నన్ని రోజులు తన పిల్లల గురించి సుమ ఏమాత్రం ఆందోళన చెందలేదని వెల్లడించారు.

ఇలా పిల్లలను కంటికి రెప్పలా చూసుకున్న అత్తయ్య తన మధ్య లేకపోవడంతో ఆ లోటు అలాగే ఉండిపోయిందని, ప్రతిరోజు షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లగానే తన అత్తయ్య ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటారని సుమ సన్నిహితులు వెల్లడించారు. ఇకపోతే సుమ దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ యాంకర్ గా నటిగా గుర్తింపు పొందారు. ఈమె మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల తెలుగు ఎంతో స్పష్టంగా పలుకుతూ యాంకర్ గా గుర్తింపు పొందారు.ప్రస్తుతం ఏదైనా ఒక సినిమా ఫంక్షన్ జరిగిందంటే ఆ వేడుకలో సుమ తప్పనిసరిగా ఉండాల్సిందే.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus