Varun Tej: గాండీవధారి అర్జున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ చేతికి చిక్కిన వరుణ్ తేజ్!

మెగా ప్రిన్స్ వరణ్ తేజ్ అప్ కమింగ్ మూవీస్ గాండీవధారి అర్జున. ఈ మూవీలో వరుణ్ స్టైలిష్ కాప్ గా కనిపించానన్నాడు. అయితే చిత్రానికి సంబంధించిన ఫ్రీ రిలీజ్ వేడుకలు వరుణ్ ,సుమ చేతికి చెప్పడమే కాకుండా పెళ్లి గురించి కొన్ని సంచలమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుణ్ ,సుమ ల మధ్య జరిగిన సంభాషణ కు సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతుంది.
ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు యాంకర్ గా వ్యవహరించిన సుమ తనదైన శైలిలో చేతిలో గన్ పట్టుకొని ఈవెంట్లో హల్చల్ చేసింది.

దాంతోపాటుగా చిత్ర బృందాన్ని తన బుల్లెట్ వంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ లలో పెళ్లి తర్వాత ఎవరు ఎక్కువగా మారిపోయారు అని సుమ వరుణ్ ను అడిగింది. దీనికి ఏం చెప్పాలో అర్థం కాక కాసేపు తడబడిన వరుణ్ సుమకు మంచి రిప్లై ఇచ్చాడు. పెళ్లయ్యాక ఎవరైనా మారాల్సిందే కదా.. అని అంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఉద్దేశిస్తూ….ఆయన ఎఫ్2 మూవీలో మాకు అదే నేర్పించారు మరి అని అన్నారు.

అయితే సుమ అంతటితో వదలకుండా ఒకేసారి లావణ్య మరియు నిహారిక ఇద్దరి దగ్గర నుంచి అర్జెంటుగా ఫోన్ చేయమని మెసేజ్ వస్తే ముందు ఎవరికి కాల్ చేస్తావు అని అడిగింది. అంతేకాకుండా లావణ్య ఏం చెప్తాడో జాగ్రత్తగా విను అని కెమెరా వైపు చూస్తూ కొంటగా అంది. అయితే వరుణ్ మాత్రం ముందు నిహారిక చేస్తాను, ఎందుకంటే తను చిన్నపిల్ల కదా అని సమాధానం ఇచ్చి తెలివిగా తప్పించుకున్నాడు.

అయితే ప్రస్తుతం ఈ వీడియో చూసిన అందరూ త్వరలో పెళ్లి కాబోతున్న వరుణ్ భార్య విధేయుడుగా ఉంటానని చెప్పకనే చెబుతున్నాడని. ఈ క్రమంలో లావణ్య మంచి లక్కీ వైఫ్ అని అంటున్నారు. మొన్న జూన్ 9న వీరిద్దరికీ హుటాహుటిన ఎంగేజ్మెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం చివరలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన గాండీవధారి అర్జున చిత్రం ఆగస్టు 25న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus