రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు.పి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ఈరోజు రామ్ పుట్టినరోజును పురస్కరించుకుని చిన్నపాటి గ్లింప్స్ ని వదిలారు.
గ్లింప్స్ విషయానికి వస్తే.. ఓ పెద్ద హీరో సినిమా రిలీజ్ రోజున ఊర్లల్లో ఉండే మాస్ థియేటర్ వద్ద ఎలాంటి సందడి ఉంటుంది… అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది అనేది చూపించారు. ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో ఉండే థియేటర్ల వద్ద సందడి గుర్తుచేస్తూ ఈ గ్లింప్స్ సాగింది.
సామాన్య జనాలు థియేటర్ వద్ద క్యూలో నిలబడి కౌంటర్ ఓపెన్ చేసే వరకు పడిగాపులు కాయడం.. మరోపక్క పలుకుబడి ఉన్న వాళ్ళు థియేటర్ యాజమాన్యానికి ఫోన్ చేసి టికెట్లు బుక్ చేసుకోవడం వంటివి చూపించారు. ఇంతలో హీరో సైకిల్ పై వచ్చి హౌస్ ఫుల్ బోర్డు పెట్టినప్పటికీ కౌంటర్ వద్ద 50 టికెట్లు అడగడం..! తర్వాత ఆ థియేటర్ కు చెందిన వ్యక్తి ‘ఎవరి తాలూకా?’ అని అడిగితే ‘ఫ్యాన్స్’ అంటూ హీరో సమాధానం ఇవ్వడం.
వెంటనే థియేటర్లో ఉన్న వ్యక్తి 50 టికెట్లు ఇవ్వడాన్ని చూపించారు. ఆ వెంటనే హీరో సూర్య పాత్ర చేస్తున్న ఉపేంద్ర కటౌట్ వద్దకు వెళ్లి స్టైల్ గా నిలబడగానే టైటిల్ రావడం.. వంటివి గ్లింప్స్ లో ఉన్నాయి. అంతకు మించి కథపై ఎటువంటి క్లూ ఇచ్చింది లేదు. కాకపోతే వివేక్- మెర్విన్ సంగీతం బాగుంది. సిద్ధార్థ నూని సినిమాటోగ్రఫీ కూడా కలర్ఫుల్ గా అనిపిస్తుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :