పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) లానే రిలీజ్ కోసం కష్టపడుతున్న పెద్ద సినిమా ఏదంటే.. డౌట్ లేకుండా అంతా ముక్తకంఠంతో ‘విశ్వంభర’ (Vishwambhara) పేరే చెబుతారు. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేస్తున్న మరో సోసియో ఫాంటసీ మూవీ ఇది. ‘బింబిసార’ (Bimbisara)ఫేమ్ మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta) దర్శకుడు. ఈ ఏడాది సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల వాయిదా వేశారు.
తర్వాత సమ్మర్ రిలీజ్ అన్నారు. అలాంటిదేమీ జరగలేదు. తర్వాత ఆగస్టు 22.. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అవుతుంది అన్నారు. కానీ మధ్యలో జూలై 24 కి కన్ఫర్మ్ అన్నారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కి కూడా కన్ఫర్మ్ అయ్యేలా లేదు. అందుకే ఆ డేట్ కి నితిన్ (Nithiin) ‘తమ్ముడు’ ని (Thammudu) తీసుకురావాలని నిర్మాత దిల్ రాజు (Dil Raju) భావిస్తున్నారు.ఈ మధ్యనే జూలై 4న ‘తమ్ముడు’ ని రిలీజ్ చేయబోతున్నట్టు టీం వెల్లడించింది.
కానీ ఆ డేట్ కి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ‘కింగ్డమ్’ (Kingdom) వస్తుండటంతో వాయిదా వేయక తప్పలేదు. ఇక ‘కింగ్డమ్’ ‘విశ్వంభర’ సినిమాలని కూడా నైజాంలో దిల్ రాజే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ‘తమ్ముడు’ కి ఎలాగూ ఆయనే నిర్మాత.అందుకే 3 సినిమాలకి కలిసొచ్చేలా రిలీజ్ డేట్లు ఫైనల్ చేస్తున్నారు. అయితే చిరంజీవి ‘విశ్వంభర’ నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ఆ సినిమాకి ఆగస్టు తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు.