మహేష్ బాబు, దర్శకుడు శ్రీను వైట్ల కలయికలో ‘దూకుడు’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ‘ఆగడు’ అనే మాస్ సినిమా మూవీ చేశారు. 2014 సెప్టెంబర్ 19న భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా.. డిజాస్టర్ గా మిగిలిపోయింది. ‘ ‘గబ్బర్ సింగ్’ ‘దూకుడు’ సినిమాలను మిక్స్ చేసి తీసినట్టు ఉంది’ అంటూ ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు. అయినప్పటికీ ఓపెనింగ్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేసిన ‘ఆగడు’.. ఆ తర్వాత చతికిలపడింది. ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం దర్శకుడు అనిల్ రావిపూడి అని చాలా మంది అంటుంటారు. దాని వెనుక ఉన్న కహానీని అనిల్ రావిపూడి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ..” ‘ఆగడు’ సినిమా సెకండాఫ్ నేను ‘పటాస్’ స్టైల్లో చేద్దామని దర్శకులు శ్రీను వైట్ల గారికి చెప్పాలనుకున్నాను. మీరు ‘ఆగడు’ సెకండాఫ్ చూస్తే.. అది పూర్తిగా ఎంటర్టైన్మెంట్ స్టైల్లో ఉంటుంది. అదే మీరు ‘పటాస్’ చూస్తే.. అందులో ఎమోషనల్ టచ్ ఉంటుంది. అలాగే హీరోయిజంతో కథనం సాగుతుంది. నేను ‘పటాస్’ స్టైల్లో సెకండాఫ్ చేద్దామని శ్రీను వైట్ల గారికి చెబుదాం అనుకున్నాను. కానీ దానికి నేను దర్శకుడిని కాదు. మరోపక్క శ్రీను వైట్ల గారు బాగా నమ్మిన ఫార్మాట్ తో ‘ఆగడు’ సెకండాఫ్ డిజైన్ చేసుకుంటున్నారు. నేను చెబుదాం అనుకుంటున్న టైంలో ఆయన వర్క్ స్టార్ట్ చేసేశారు.
సో మేము కూడా ఆయన నమ్మిన పద్ధతిలో పనిచేశాము. ఒకవేళ నేను కనుక చెప్పి ఉంటే ‘పటాస్’ సెకండాఫ్ ‘ఆగడు’ అయ్యుండేదేమో. స్పీడ్ గా చేయడం వల్ల.. మాకు ఆలోచించుకునే టైం లేదు. ఫస్ట్ హాఫ్ కి నేను పనిచేశాను. ‘ఆగడు’ కి నేను(అనిల్ రావిపూడి), ఉపేంద్ర అని మేము ఇద్దరం వర్క్ చేశాము. సెకండాఫ్ టైంకి నా ‘పటాస్’ స్టార్ట్ అయ్యింది. నేను దానికి మూవ్ అయిపోయాను. అందుకే శ్రీను వైట్ల గారు ఇప్పటికీ అంటుంటారు. ‘నువ్వు సెకండాఫ్ కి పని చేయకుండా వెళ్లిపోయావ్! నీ అంతు చూస్తాను’ అంటూ సరదాగా అంటుంటారు” అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు.
https://x.com/phanikumar2809/status/1969299588990246935