Ramana Gogula Song: ఆ పాట తీసేసింది నిజమేనట.. తర్వాత వాడతా అని కూడా మాటిచ్చారట
- January 28, 2026 / 01:01 PM ISTByFilmy Focus Desk
‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో రమణ గోగుల ఓ పాట పాడారని కొన్ని రోజుల క్రితం ఓ వార్త వచ్చింది. మీరు కూడా చదివే ఉంటారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సెంటిమెంట్‌తో ఈ సినిమాలోనూ రమణ గోగులతో పాట పాడించారని ఆ వార్తల సారాంశం. అప్పట్లో ఈ పాట ఉందని, లేదని ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. అయితే సినిమా రిలీజ్ డేట్ వచ్చేస్తోంది, పాటల లిరికల్ వీడియోలు రిలీజ్ అయిపోయాయి ఇంకా పాట రావడం లేదేంటి అనుకుంటే ఆయన పాట లేదు కానీ బాబా సెహగల్ పాట అయితే ఉంది అని రిలీజ్ చేశారు.
Ramana Gogula Song
‘హుక్‌స్టెప్’ అంటూ ఆయన తనదైన రీతిలో అదరగొట్టేశారు. అయితే ఆ పాట బదులు రమణ గోగుల పాట పెడదామని తొలుత అనిల్ అనుకున్నారని వార్తలు మళ్లీ వచ్చాయి. ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా కోసం కూడా రమణ గోగులతో భీమ్స్ సిసిరోలియో ఒక పాట పాడించారు. అయితే సినిమా స్టార్టింగ్‌లో మెలోడియస్ సాంగ్ ఎందుకు?, సినిమా ఫ్లో ప్రకారం ఎనర్జిటిక్ పెప్పీ నంబర్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నారట.

అలా రమణ గోగుల పాట ప్లేస్‌లో బాబా సెహగల్ పాట వచ్చేసిందని అనిల్ రావిపూడి చెప్పారు. అయితే ఇదే విషయాన్ని రమణ గోగులకు వివరించారట. అంతేకాదు తన రాబోయే చిత్రాల్లో ఆ పాటను ఎక్కడో ఒకచోట ఉపయోగిస్తానని కూడా రమణ గోగులకు అనిల్ రావిపూడి హామీ ఇచ్చారట. అయితే ఆ పాటను సినిమా మొదట్లో కాకుండా తర్వాత ఎక్కడైనా వాడితే సరిపోయేది అనే డౌట్ రావొచ్చు.
కానీ అనిల్ రావిపూడి అలా అడ్జస్ట్ చేసుకునే రకం కాదు. తన సినిమా అయినా ఎడిట్ టేబుల్ దగ్గర నిర్దాక్షిణ్యంగా కట్ చేసేస్తారు అని మొన్నీమధ్య ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి చెప్పారు. అలా వీటీవీ గణేశ్ పాత్రను కూడా సినిమా నుండి లేపేశారు. మరో పాటలో బ్రహ్మానందం, సప్తగిరి ఎంట్రీలను కూడా తీసేశారు.
















