మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేయడం లేదు. అలా అని తీసిపారేసే కలెక్షన్స్ కూడా కాదు అని చెప్పాలి. నెగిటివ్ టాక్ తో కూడా రూ.50 కోట్లు గ్రాస్ వచ్చింది అని మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా చెప్పుకున్నారు.
ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. రవితేజ ఎప్పుడూ చకచకా సినిమాల చేసేయాలని చూస్తుంటాడు. ఈ ఏడాది ఆల్రెడీ ‘వాల్తేరు వీరయ్య’ తో కలిపి 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అలాగే 2024 సంక్రాంతికి ‘ఈగల్’ తో రాబోతున్నాడు. ‘క్రాక్’ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నాడు. నవంబర్ మొదటి వారంలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా స్క్రిప్ట్ స్టేజిలో ఉంది. అలాగే వి.వి.వినాయక్ తో ఓ సినిమా డిస్కషన్ స్టేజిలో ఉంది.
మరోపక్క (Anil Ravipudi) అనిల్ రావిపూడితో కూడా ఓ సినిమా చేయాలని రవితేజ భావిస్తున్నాడు. ‘భగవంత్ కేసరి’ వంటి హిట్ కొట్టిన అనిల్ కి ఇప్పుడు పెద్ద హీరో దొరికే ఛాన్స్ లేదు. అందుకే రవితేజ చూపు అనిల్ పై పడింది. ‘కథ రెడీ చేసుకుని రమ్మని’ ఆల్రెడీ అనిల్ కి పిలుపిచ్చారు రవితేజ. ఆల్రెడీ ఈ కాంబినేషన్లో ‘రాజా ది గ్రేట్’ అనే హిట్ సినిమా వచ్చింది. ఇక 2025 లోపు ఇంకో రెండు ప్రాజెక్టులు సెట్ చేసుకోవాలి అనేది రవితేజ ప్లాన్ గా తెలుస్తుంది.