Anil Ravipudi: బాలయ్య అనిల్ రావిపూడి సినిమాకు రిపీట్ అవ్వబోతున్న సెంటిమెంట్!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఇదివరకు ఎప్పుడు కనిపించని విధంగా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారని అనిల్ రావిపూడి ఇదివరకే తెలియజేసిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సినిమాకు భగవంత్‌లాల్ కేసరి అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్టుగా ప్రచారం అయితే మొదలైంది. ఐ డోంట్ కేర్ అనేది ట్యాగ్ లైన్ గా ఉండబోతుందని అంటున్నారు. నందమూరి బాలకృష్ణ కు తన సినిమాల విషయంలో కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. ఈ సెంటిమెంట్లలో టైటిల్ లో కూడా సింహ అనే పదం ఉంటే ఆ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని భావిస్తారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ సినిమా టైటిల్ లోసింహ ఉండేలా బాలకృష్ణ జాగ్రత్త పడతారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమా విషయంలో కూడా మరోసారి బాలకృష్ణ సెంటిమెంట్ రిపీట్ కాబోతుందని తెలుస్తోంది. బాలయ్య సెంటిమెంట్ ను గౌరవిస్తూనే హిందీలో సింహాన్ని పిలిచే కేసరి పదాన్ని ఈ సినిమా టైటిల్ కి కలిపినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా విషయంలో కూడా బాలకృష్ణ సెంటిమెంట్ ఉండబోతుందని సమాచారం.

ఇక ఇందులో బాలకృష్ణ వయసైన వ్యక్తి పాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఇందులో బాలకృష్ణకు భార్య పాత్రలో కాజల్ అగర్వాల్ నటించగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూతురి పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10వ తేదీన ఈ టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus