నందమూరి బాలకృష్ణతో (Balakrishna) స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) చేసిన చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari). సాధారణంగా బాలకృష్ణ అంటే ఓ ఇమేజ్ ఉంటుంది. అతని చేతిలో కత్తి పెట్టి, డైలాగులు చెప్పిస్తే సినిమా బ్లాక్ బస్టరే అని..! అలాంటి ఇమేజ్ ను బ్రేక్ చేద్దామనుకున్న ప్రతిసారి బాలకృష్ణకు చేదు అనుభవాలే మిగిలాయి. ‘భైరవద్వీపం’ (Bhairava Dweepam) చేసినా ‘ఆదిత్య 369 ‘ చేసినా అదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు బాలయ్య సినిమా అంటే కంప్లీట్ గా.. ఇందాక చెప్పిన పాటర్న్ లో ఉండాలి అని అభిమానులు ఫిక్స్ అయ్యారు.
అప్పుడు బోయపాటి (Boyapati Srinu) తప్ప బాలకృష్ణకి ఇంకో ఆప్షన్ దొరకడం లేదు. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కూడా బోయపాటి స్టైల్లోనే మారి ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) చేశాడు తప్ప కొత్తగా ఏమీ చేసింది లేదు. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’ తో కొత్త బాలయ్యని చూపించడంలో వంద శాతం సక్సెస్ సాధించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది కూడా. రూ.60 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్ల వరకు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది.
తెలంగాణ యాసలో బాలకృష్ణ చెప్పిన డైలాగులు కూడా బాగా పేలాయి. యాక్షన్ సీన్స్ కూడా అనిల్ కొత్తగా డిజైన్ చేశాడు. అంతా బాగానే ఉన్నా.. ‘భగవంత్ కేసరి’ రిజల్ట్ తో అనిల్ సంతృప్తిగా లేనట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల ఓ సందర్భంలో అతను ‘ ‘భగవంత్ కేసరి’ కనుక సంక్రాంతికి వచ్చి ఉంటే ..కచ్చితంగా డబుల్ కలెక్ట్ చేసేది’ అంటూ అతని మనసులో మాట బయటపెట్టాడు. నిజంగా ‘వీరసింహారెడ్డి’ కంటే కూడా ‘భగవంత్ కేసరి’ మంచి సినిమా. కానీ కలెక్షన్స్ విషయంలో ఆ సినిమానే ఎక్కువగా ఉంది.