అనిల్ రావిపూడి కొత్త స్కెచ్ బాగానే ఉంది.. వర్కౌట్ అయితే సూపరే..!

పాపం అనిల్ రావిపూడి. ఈ ఏడాది ఆరంభంలో ‘సరిలేరు నీకెవ్వరు’ తో బ్లాక్ బస్టర్ అందుకున్నా ఇప్పుడు తన తరువాతి సినిమాకి హీరో దొరకని పరిస్థితి. మహేష్ లాంటి స్టార్ హీరోతో తక్కువ టైములో సినిమాని తెరకెక్కించి దానిని బ్లాక్ బస్టర్ కొట్టడం అంటే మాటలు కాదు. అందుకే అతనికి తిరుగులేదు అని అంతా అనుకున్నారు. ఆ చిత్రం తర్వాత ‘ఎఫ్2’ సీక్వెల్ అయిన ‘ఎఫ్3’ చెయ్యాలని అనిల్ ప్లాన్ చేసుకున్నాడు. స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యింది.

అయితే కరోనా ఎఫెక్ట్ వల్ల ప్లానింగ్ మొత్తం మారిపోయింది. వెంకీ , వరుణ్ లు వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి అందరి హీరోల దగ్గరకు ఓ రౌండ్ వేసేశాడు. అందరూ అనిల్ రావిపూడితో సినిమా చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళే. కానీ వాళ్ళ పెండింగ్ ప్రాజెక్టులు ఫినిష్ అయితేనే కానీ ఓకే చెప్పలేని సిట్యుయేషన్లో ఉన్నారు. ఈ క్రమంలో అనిల్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట.

తన దగ్గర ఉన్న కథల్లో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. ఆ చిత్రం కోసం సాయి పల్లవిని కూడా అప్రోచ్ అయినట్టు తాజా సమాచారం. సాయి పల్లవి కూడా అనిల్ రావిపూడి స్క్రిప్ట్ కు ఓకే చెప్పేసిందట. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏప్రిల్, లేదా మే లోపు ఈ చిత్రాన్ని ఫినిష్ చెయ్యాలని అనిల్, దిల్ రాజు.. ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus