Anil Ravipudi: రిలాక్స్ అవుదామంటే ఆ పనులన్నీ చెబుతున్నారు!

అనిల్ రావిపూడి తాజాగా బాలకృష్ణ హీరోగా నటించినటువంటి భగవంత్ కేసరి సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయం అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి తదుపరి సినిమా ఎవరితో ఉంటుందనే విషయాలను ఇప్పటివరకు ప్రకటించలేదు. తాజాగా అనిల్ రావిపూడి బిగ్ బాస్ సోహైల్ హీరోగా నటిస్తున్నటువంటి బూట్ కట్ బాలరాజు టీజర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సినిమా టీజర్ అనిల్ రావిపూడి చేతులమీదుగా విడుదల చేశారు. ఇక ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి అనిల్ రావిపూడి కాస్త ఆలస్యంగా వచ్చారు. అయితే ఎందుకు ఆలస్యం అయిందనే విషయాలను ఈయన వెల్లడించారు. ఇటీవల తాను మంచి సక్సెస్ అందుకున్నానని అందుకే కొంత సమయం పాటు తాను రిలాక్స్ అవుదామని భావించాను

ఇదే విషయం నా భార్యకు చెబితే ఆమె పిల్లల్ని స్కూల్ దగ్గర దింపిరా అంటూ నాకే పనులు చెబుతుంది అందుకే రేపటి నుంచి పనులలో బిజీ అవుతున్నాను అంటూ ఈ సందర్భంగా తాను ఆలస్యం కావడానికి కారణాన్ని తెలియజేశారు అంతేకాకుండా సోహైల్ గురించి మాట్లాడుతూ తాను మొదటి నుంచి కూడా ఎంతో కష్టపడుతూ ఉన్నారని అందుకే తనని నేను సపోర్ట్ చేస్తున్నానని తెలిపారు.

ఇక ఈ చిత్ర బృందానికి (Anil Ravipudi) అనిల్ రావిపూడి బెస్ట్ విషెస్ తెలియజేయడమే కాకుండా ఈ సినిమాలో నటిస్తున్నటువంటి వారి గురించి పలు విషయాలను వెల్లడించారు. ఈ సినిమాకు సొహెల్ నిర్మాతగా వ్యవహరించడంతో జాగ్రత్త అంటూ పలు జాగ్రత్తలను కూడా అనిల్ రావిపూడి తెలియజేశారు. ఇక బాలయ్య తో హిట్ అందుకున్నటువంటి అని రావిపూడి తదుపరి ఏ హీరోని లైన్ లో పెట్టబోతున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus