Anil Ravipudi, Balakrishna: ఆ కామెంట్లపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి!

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా తెరకెక్కుతాయనే సంగతి తెలిసిందే. వరుసగా 5 విజయాలను సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమాతో డబుల్ హ్యాట్రిక్ దక్కుతుందని బలంగా నమ్ముతున్నారు. ఎఫ్3 సినిమా ఈ నెల 27వ తేదీన రిలీజ్ కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనిల్ రావిపూడి, సునీల్ తో కలిసి అలీతో సరదాగా షోకు హాజరయ్యారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటించడం ఇదే తొలిసారని ఎఫ్3 సినిమాలో నటించడం అద్భుతమైన అనుభవం అని సునీల్ అన్నారు.

ఎఫ్3 సినిమా క్యారవాన్ బస్ డిపోలా ఉంటుందని సునీల్ చెప్పుకొచ్చారు. ఎఫ్4 సినిమా ఉంటుందా అనే ప్రశ్నకు అనిల్ రావిపూడి స్పందిస్తూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందించడమే మన విధి అని అన్నారు. విక్టరీ వెంకటేష్ ఇంత దొరికితే చాలు దూరిపోతాడంటూ అలీ కామెంట్లు చేశారు. ఎంటర్టైన్మెంట్ ప్యారలల్ గా ఉండటం వల్ల తాను కామెడీ సినిమాలు తీస్తానని అనిపించి ఉండవచ్చని బాలయ్య సినిమాతో ఆ ఇమేజ్ ను మార్చుకుంటానని అనిల్ రావిపూడి ఎక్స్ ప్రెషన్లతో వెల్లడించారు.

తనపై వ్యక్తమైన కామెంట్ల గురించి అనిల్ క్లారిటీ ఇచ్చారు. సుబ్బరాజు వాళ్ల డాడీ మా తెలుగు ప్రొఫెసర్ అంటూ అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్నప్పుడు హీరో కావాలని అనుకున్నానని తర్వాత గ్లామర్ పాడు కావడంతో కామెడీ విలన్ కావాలని అనుకున్నానని సునీల్ చెప్పారు. మీకు విమానాలు ఎక్కాలంటే భయమా? అని అలీ అడగగా మొదట హైట్ ఫోబియా ఉండేదని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

అనిల్ రావిపూడి వైఫ్ అతని క్లాస్ మేట్ అని అనిల్ తన వైఫ్ తో పాటు మరో ఇద్దరికి కూడా లైన్ వేశాడని అలీ చెప్పగా మరిచిపోయిన గాయాన్ని రేపడం అవసరమా అని అనిల్ అన్నారు. అనిల్ రావిపూడి సాఫ్ట్ కాదని లోపల ఉగ్ర నరసింహుడు ఉన్నాడని అలీ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus