Anil Ravipudi: 2026 సంక్రాంతిని మరింత రఫ్ఫాడించేందుకు అనిల్ మాస్టర్ ప్లాన్

సీనియర్ స్టార్ హీరోలు ఇంకా సోలో హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోలంతా పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల.. స్టార్ డైరెక్టర్లకి వీళ్ళు తప్ప వేరే ఛాయిస్ కనిపించడం లేదు. అనిల్ రావిపూడి (Anil Ravipudi), దర్శకుడు బాబీ , గోపీచంద్ మలినేని (Gopichand Malineni).. వాళ్లకు సీనియర్ స్టార్ హీరోల డేట్స్ దొరకడం కూడా కష్టంగానే ఉంది. ఇదిలా ఉంటే.. సీనియర్ స్టార్ హీరోలు కలిసి ఒక సినిమాలో నటించిన సందర్భాలు కూడా లేవు.

Anil Ravipudi

ఎందుకంటే స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడం అనేది ఈజీ కాదు. అందులోనూ ఒకే జెనరేషన్ స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడం పెద్ద సవాల్. ఒకప్పటి స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్లు చేసినా… వాళ్లకు ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే సెట్స్ లో నుండి వెళ్లిపోయే వాళ్లు. తర్వాత నిర్మాతలు బ్రతిమిలాడి తీసుకొచ్చేవారు. అందుకే తర్వాత చాలా కాలం పాటు మల్టీస్టారర్లు రాలేదు.

 

‘ఆర్.ఆర్.ఆర్’ (R.R.R) తీసేస్తే ఈ మధ్య కాలంలో ఒకే జెనరేషన్ హీరోలు కలిసి నటించిన సినిమా ఇంకోటి లేదు. అయితే ఎట్టకేలకు చిరు (Chiranjeevi) – వెంకటేష్ (Daggubati Venkatesh) కలిసి నటించబోతున్నారట. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇందులో ఓ ముఖ్య పాత్రలో వెంకటేష్ (Daggubati Venkatesh) కూడా కనిపించనున్నారు అనేది ఇన్సైడ్ టాక్.

సెకండాఫ్ లో వచ్చే కీలక ఎపిసోడ్ లో వెంకీ కనిపిస్తారట. చిరు- వెంకీ కలిసి చేసే కామెడీ థియేటర్లను షేక్ చేస్తుంది అంటున్నారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) తో చిరు- వెంకీ చాలా సన్నిహితంగా ఉంటారు. కాబట్టి.. వీళ్ళని ఎలా హ్యాండిల్ చేశాడో చూడాలి మరి.

‘కింగ్డమ్’ టీం త్యాగాలకు అర్థం లేకుండా పోయిందిగా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus