Pawan Kalyan: పవన్ చిన్నప్పుడు అలాంటి సమస్యతో బాధపడేవారా!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా రాజకీయ నాయకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. అలాగే రాజకీయాలలో కూడా సక్సెస్ సాధించడం కోసం పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు. ఇలా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలుపొందడం కోసం కష్టపడుతూ ఉన్నారు. ఇలా ఒకవైపు సినిమా షూటింగ్లలోను మారో వైపు రాజకీయాలలోనూ పవన్ కళ్యాణ్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తల్లి అంజనమ్మ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె తన కుమారుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు ఒక అనారోగ్య సమస్యతో బాధపడే వారిని అంజనా దేవి వెల్లడించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా సినిమాలపరంగాను ఎండ వాన అనక తిరుగుతున్నారని ఈమె తెలియజేశారు.

అసలు తను తన ఆరోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకోడని ఈమె తెలియజేశారు. అయితే చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆస్తమా సమస్యతో బాధపడే వారని అందుకే తనని చాలా జాగ్రత్తగా పెంచానని ఈ సందర్భంగా ఈమె పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు బాధపడుతున్నటువంటి అనారోగ్య సమస్య గురించి వెల్లడించారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు ఎన్నో కోట్ల మందికి సేవ చేయమని భగవంతుడు తనకి పని పెట్టాడని అయితే ఏదో ఒక రోజు వాడు విజయం సాధిస్తాడనే నమ్మకం నాకుంది

అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి తన తల్లి అంజనాదేవి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక పెద్ద కుమారుడు చిరంజీవి గురించి కూడా మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి ఇతరులకు సహాయం చేసే అలవాటు ఉంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే ఆదుకోవడానికి ముందు ఉండేవారు అదే అలవాట్లు ఇప్పటివరకు అలాగే కొనసాగుతూ వస్తున్నాయని ఈమె తన కొడుకు గురించి చెబుతూ మురిసిపోయారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus