Anni Manchi Sakunamule Trailer: మళ్ళీ ప్రభాస్ ని వాడేశాడు..!

దివంగత రచయిత, దర్శకుడు అయిన శోభన్.. ప్రభాస్ తో ‘వర్షం’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రభాస్ కు మొదటి బ్లాక్ బస్టర్ ను అందించింది. ఆ కృతజ్ఞతతోనో ఏమో కానీ.. శోభన్ తనయుడు సంతోష్ ను చేరదీస్తున్నాడు ప్రభాస్. తన హోమ్ బ్యానర్ లాంటి ‘యూవీ క్రియేషన్స్’ లో సినిమాలు చేయించాడు. ‘ఏక్ మినీ కథ’ ‘మంచి రోజులు వచ్చాయి’ ‘కళ్యాణం కమనీయం’ వంటి సినిమాలు ఈ బ్యానర్లో చేశాడు సంతోష్ శోభన్.

వీటి రిజల్ట్ సంగతి పక్కన పెడితే .. సంతోష్ శోభన్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోడానికి, కొంత మార్కెట్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ సినిమాలు ఉపయోగ పడ్డాయి. అయినప్పటికీ సంతోష్ శోభన్ కు ఓ హిట్ కావాలి. అందుకే అతని లేటెస్ట్ మూవీ ‘అన్నీ మంచి శకునములే’ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ‘మహానటి’ ‘జాతి రత్నాలు’ ‘సీతా రామం’ వంటి బ్లాక్ బస్టర్లు అందుకున్న ‘స్వప్న సినిమా’ బ్యానర్ పై ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

నందినీ రెడ్డి (Anni Manchi Sakunamule) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది. మే 18న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. కొద్దిసేపటి క్రితం ఈ చిత్రం ట్రైలర్ ను ఎన్టీఆర్ లాంచ్ చేశాడు.’అన్నీ మంచి శకునములే’ ట్రైలర్ చాలా బాగుంది. కథ పరంగా కొత్తగా కనిపించకపోయినా.. మంచి ఎమోషన్స్,డైలాగ్స్, లవ్ స్టోరీ, కామెడీ.. ఇలా అన్నీ సినిమాలో ఉన్నట్టు ట్రైలర్ చెప్పకనే చెప్పింది.

ట్రైలర్ చివరిలో ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అంటూ సంతోష్ శోభన్ .. ప్రభాస్ డైలాగ్ చెప్పడం.. ట్రైలర్ మొత్తానికి మంచి హై ఇచ్చినట్టైంది. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus