బాలీవుడ్ ఫేవరెట్ స్క్రిప్ట్‌ల్లో క్రికెటర్ల బయోపిక్ ఒకటి. కాస్త పేరు తెచ్చుకొని, రిటైర్ అయిన క్రికెటర్లో, రిటైర్‌మెంట్‌కి దగ్గరవుతున్న క్రికెటర్ల బయోపిక్స్ అంటే బాలీవుడ్ కథకులు భలే ఆసక్తి చూపిస్తుంటారు. అందులోనూ రియల్ లైఫ్‌లోనూ హీరో అయితే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా బాలీవుడ్‌లో ఓ బయోపిక్‌కి రంగం సిద్ధమవుతోంది. ఈసారి కథాంశం అవ్వబోతున్న క్రికెటర్ ఆరు సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ బయోపిక్ వస్తుందని చాలా రోజుల క్రితం వార్తలొచ్చాయి.
అయితే ఆ తర్వాత ఆ ఊసు లేదు. అయితే ఇప్పుడు ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ పనిలో ఉన్నారట. ఇప్పటికే యువరాజ్ కుటుంబంతో మాట్లాడి సినిమా గురించి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారట. త్వరలోనే సినిమా మొదలవుతుందని టాక్. హృతిక్ రోషన్ లేదా రణ్‌బీర్ కపూర్‌లో ఒకరు యువరాజ్‌గా కనిపిస్తారని టాక్. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుంది. యువరాజ్ జీవితం సినిమాగా మారుతుంది అంటే… వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్లోని కీలక అంశాలు చూపించాల్సిందే.
ఆయన వ్యక్తిగత జీవితం అంటే… స్టార్ క్రికెటర్ అవ్వకముందు ఓ ప్రముఖ క్రికెటర్‌తో (అప్పటికి కాదు) ఉన్న విభేదాలు, ప్రేమ వ్యవహారాలు, క్యానర్‌ను ఎదుర్కొన్న విషయం.. ఇలా చాలా వస్తాయి. ఇక మైదానం సంగతి చూస్తే ఆయన చూపించిన అగ్రెషన్, యాటిట్యూడ్‌ను చూపించాల్సి ఉంటుంది. అప్పుడే సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది.