తెలుగు పదాలను పదును చేసిన రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. పొడి పొడి మాటలతో పంచ్ లు పేల్చడమే కాదు.. కన్నీటిని రాల్చగల నేర్పరి. అందుకే ఆయనన్నా, ఆయన సినిమాలన్నా తెలుగువారందరికీ ఇష్టం. స్టార్ హీరో దక్కించుకున్న ఈ డైరక్టర్ ని చూసేందుకు, ప్రసంగాన్ని వినేందుకు ఎంతదూరమైనా వెళ్తుంటారు. అంత క్రేజ్ సంపాదించుకున్న త్రివిక్రమ్ తాజాగా అమర్‌రాజా బ్యాటరీస్ ఫౌండేషన్ డే వేడుకల్లో పాల్గొని, 7 నిముషాల పాటు ప్రసంగించారు. ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఆకట్టుకుంది.
‘కార్లో బ్యాటరీ ఉంటుందని తెలుసు కానీ.. బ్యాటరీ వెనక ఇంత మంది ఉంటారని మాత్రం ఇప్పుడే తెలిసింది’ అనే మాటతో అమర్‌రాజా బ్యాటరీస్ ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపిన త్రివిక్రమ్.. యుద్ధాలు.. యుగాలు అనే టాపిక్ పై ఐదు నిముషాలు అర్ధవంతంగా, ఆలోచనాత్మకంగా మాట్లాడి చప్పట్లు అందుకున్నారు. యుగాల నుంచి యుద్ధాలు జరుగుతున్నాయని.. క్రమంగా యుద్ధాలకు గల కారణం మరీ చీప్ అయిపోయిందని అస్త్రాలు సంధించారు. త్రివిక్రమ్ పూర్తి ప్రసంగం కావాలనుకుంటే కింది వీడియోని చూడండి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.