అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గూజ్ బంప్స్ తెప్పించే అప్డేట్..!

అల్లు అర్జున్- సుకుమార్ ల హ్యాట్రిక్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రం ‘రంగస్థలం’ ను మించి మాస్ గా ఉంటుందని సుకుమార్ సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాల పై మక్కువ చూపిస్తున్న తరుణంలో మన అల్లు అర్జున్ కూడా ‘పుష్ప’ తో అదే బాటలో నడవడానికి రెడీ అవుతున్నాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థల పై నవీన్, వై రవిశంకర్, సీవీ మోహన్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకుఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ,తమిళ భాషల్లో విడుదల చెయ్యనున్నారు.ఆ విషయాన్ని నిన్న ఓ మాస్ పోస్టర్ ద్వారా తెలియజేసారు. ఈ పోస్టర్ విడుదలైనప్పటి నుండీ ‘పుష్ప’ లో మరో హీరో కూడా ఉన్నాడంటూ డిస్కషన్లు మొదలయ్యాయి. అలా అని మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నాడని కాదు.! ఈ చిత్రంలో ఇద్దరు అల్లు అర్జున్ లు కనిపించబోతున్నారట. అదేనండీ మన బన్నీ డబుల్ రోల్ చేస్తున్నాడని కొందరు చెబుతున్నారు. నిజానికి ‘పుష్ప’ నుండీ విడుదలైన మొదటి పోస్టర్ లో హీరో కాలికి ఆరు వేళ్లు కనిపించాయి.

అయితే నిన్న విడుదల చేసిన పోస్టర్ లో హీరో కాలికి ఐదు వెళ్ళే ఉన్నాయట.దాంతో అల్లు అర్జున్ డబుల్ రోల్ ప్లే చేస్తున్నాడని అంతా ఫిక్స్ అయిపోయారు.ఈ వార్తలో ఎంత వరకూ నిజముందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకూ వెయిట్ చెయ్యాల్సిందేనేమో.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus