Venky & Anil: మరోసారి ‘శంకరవరప్రసాద్’ స్టైల్‌లో అనిల్ రావిపూడి.. వెంకీ సినిమాలోనూ
- January 30, 2026 / 04:34 PM ISTByFilmy Focus Desk
సంక్రాంతి రావడం.. హిట్ కొట్టడం.. రిపీట్.. అనే స్టైల్‌లో ప్రస్తుతం సినిమాలు చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి. వచ్చే ఏడాది కూడా సంక్రాంతికి రావడానికి ఆయన రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు అఫీషియల్‌గా ప్రకటించలేదు కానీ. వచ్చే పొంగల్‌కి వెంకటేశ్‌తో కలసి అనిల్ రావిపూడి చేసే హంగామాను మనం సంక్రాంతికి చూడబోతున్నాం. ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా చాలా రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. అందులో ఒకట్రెండు అనిల్ స్వయంగా ఇచ్చిన లీకులు ఉన్నాయి.
Venky & Anil
ఇప్పుడు సినిమా టీమ్ నుండి వస్తున్న మరో సమాచారం. ఈ సినిమాలో ఇంకో హీరోగా కూడా ఉంటాడు అని. అంటే ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా తరహాలోనే ఇంకో హీరోను ఓ చిన్న పాత్ర కోసం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట అనిల్. ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయట. ఇటు తమిళ సినిమాలు, అటు మలయాళ సినిమాలో పేరున్న హీరోను, ఇతరుల సినిమాల్లో కేమియోలు, చిన్న ముఖ్యమైన పాత్రలు చేసే అలవాటు ఉన్న హీరోను చూస్తున్నారు.

ఈ క్రమంలో తమిళ సినిమా నుండి కార్తి పేరు విషయంలో ఓకే అవ్వగా, మలయాళ సినిమా నుండి ఫహాద్ ఫాజిల్ పేరు ఓకే అనుకున్నారట. ఈ ఇద్దరిలో ఒకరిని ఈ సినిమాలో నటింపజేస్తారు అని అంటున్నారు. మరి ఆ పాత్రేంటి, ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇక ఈ సినిమాను త్వరలో అనౌన్స్ చేస్తారని సమాచారం. సినిమాకు నిర్మాణ సంస్థకు షైన్ స్క్రీన్స్ ఉంటుంది. ఆ బ్యానర్‌తోపాటు మరో బ్యానర్ కూడా యాడ్ అవుతుంది అని చెబుతున్నారు. అది సురేశ్ ప్రొడక్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మొన్నీమధ్య ఈ సినిమా కథ గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఇటీవల ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా సక్సెస్ టూర్‌కి టీమ్ అంతా విశాఖపట్నం వెళ్లినప్పుడు ఓ పాయింట్ స్ట్రైక్ అయిందట. దాని మీద తన టీమ్ వర్క్ చేస్తోందని చెప్పారు. ఆ సినిమా అనౌన్స్‌మెంట్ నుండి అంతా షాకింగ్‌గానే ఉంటుందని చెప్పారు. దాని కోసం ఓ స్పెషల్ వీడియో సిద్ధం చేస్తారట.















